టెక్నాలజీ పెరిగే కొద్దీ మొబైల్స్ లో సాఫ్ట్ వారే మారుతూ కొత్త మోడల్స్ వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా మార్కెట్ లోకి రియల్ మీ ఎక్స్3 మనదేశంలో లాంచ్ కానుందని తెలిపారు. రియల్ మీ ఇండియా సీఈవో మాధవ్ సేథ్ ఈ విషయాన్ని సామజిక మీడియా ద్వారా సందేశాన్ని అందజేశారు. 

 

 

రియల్ మీ ఎక్స్3 కూడా గూగుల్ ప్లే కన్సోల్ లో RMX 2085L1 మోడల్ నంబర్ తో కనిపించిందన్నారు. ఈ లిస్టింగ్ ప్రకారం ఈ స్మార్ట్ ఫోన్ 2400 x 1080 పిక్సెల్స్ తో రానుందన్నారు. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 855+ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుందన్నారు. 8 జీబీ వరకు ర్యామ్ ఇందులో అందిస్తుందన్నారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనున్నట్లు తెలిపారు.

 

 

రియల్ ఎక్స్3 సూపర్ జూమ్ విషయానికి వస్తే.. దీనికి స్పెసిఫికేషన్లు ఇప్పటికే ఆన్ లైన్ లో లీకైయ్యాయి. వీటిని బట్టి ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఎల్సీడీ డిస్ ప్లేను అందిస్తున్నట్లు సమాచారం. ఇందులో 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఫీచర్ కూడా ఉందన్నారు. 4200 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు. 30W ఫాస్ట్ చార్జింగ్ ను ఇది సపోర్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీ యూఐ ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు.

 

 

ఫోన్ లో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ గా ఉంది. దీంతో పాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్, 8 మెగా పిక్సెల్ పెరిస్కోప్ లెన్స్ ను ఇందులో అందించారు. 60x డిజిటల్ జూమ్, 5x ఆప్టికల్ జూమ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. 32 మెగా పిక్సెల్, 8 మెగా పిక్సెల్ రెండు సెన్సార్లను ముందువైపు అందించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: