ఎంత లగ్జరీ ఫోన్ అయినా మహా అయితే 50-60 వేల రూపాయలు ఉంటాయి. కాకపోతే వాటికి గోల్డెజ్ జ్యూయలరీ, యాక్సెసరీస్ అంటే వాటి రేటే వేరు. కానీ కేవలం ఫోన్ ధర మాత్రమే లక్షల్లో ఉండే ఓ ఫోన్ గురించి ఇప్పడు  తెలుసుకుందాం.. దాదాపు 9 లక్షల 30 వేల రూపాయల విలువ చేసే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్ ను ఇజ్రాయిల్ కు చెందిన సిరిన్ ల్యాబ్స్ విడుదల చేసింది.

ఈ ఫోన్ పేరు సోలారిన్.. దీన్ని ఓ స్టార్టప్ కంపెనీ రూపొందించడం విశేషం. సిరిన్ ల్యాబ్స్ మంగళవారం నాడు లండన్ మార్కెట్‌లో ఈ ఖరీదైన ఫోన్ ను ఆవిష్కరించింది. మరి అంత ఖరీదు పెట్టి కొంటున్నామంటే అందుకు తగిన సదపాయాలు, ప్రత్యేకతలు ఉండాలిగా.. అవేంటో ఇప్పుడు చూద్దాం.. సైనికులు యుద్ధ రంగంలోకి వెళ్లేటప్పుడు లభించేంతటి సెక్యూరిటీ ఆప్షన్లు ఈ ఫోన్లో ఉన్నాయట. 

ప్రపంచంలోనే కాస్ట్లీ ఫోన్.. అన్నీ ప్రత్యేకతలే.. 



ఈ రోజుల్లో మనకు కాళ్లూ, చెవులూ, ముక్కూ , నోరూ.. అన్నీ సెల్ ఫోనే అయిపోయిన సంగతి మనందరికీ అనుభవమే. అందులోనూ మొబైల్ లోనే ఈ కామర్స్ వంటి బిజినెస్ లు చేసేవారికి అత్యంత సెక్యూరిటీ ఉన్న మొబైల్ చాలా అవసరం. అందుకే పటిష్టమైన భద్రతావ్యవస్థలతో ఈ మొబైల్ ను రూపొందించారట. ఇప్పుడు ఖరీదైన ఫోన్ కావడంతో దీన్ని  రోల్స్ రాయిస్ స్మార్ట్‌ఫోన్‌గా పిలుస్తున్నారు. 

ఇక దీని స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే..  అత్యాధునిక క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 810 ప్రాసెసర్ ఉంది. 23.8 మెగాపిక్సల్ రియర్ కెమేరా ఉంది. 5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్‌ఈడీ 2కే రెసల్యూషన్ తెర కూడా ఉంది.  సుపీరియర్ వైఫై కనెక్టివిటీ సౌకర్యం కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ వెనకాలున్న బటన్‌ను భౌతికంగా నొక్కడం ద్వారానే ఫోన్ యాక్టివేట్ చేయొచ్చు. ప్రపంచంలో ఇంతవరకు ఏ ఫోన్‌లో లేని ప్రైవసీ ఫీచర్స్ ఇందులో ఉన్నాయని, ఈ విషయంలో ప్రముఖ కమ్యూనికేషన్ సెక్యూరిటీ సంస్థ ‘కూల్ స్పాన్’ సహకారం తీసుకున్నామని కంపెనీ వర్గాలు తెలిపాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: