ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌మేకర్‌ శాంసంగ్‌  గెలాక్సీ ఎ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్లను లాంచ్‌ చేసింది. గెలాక్సీ  ఎ 8, గెలాక్సీ 8 ప్లస్‌ 2018 మోడల్స్‌ను  మార్కెట్లో విడుదల చేసింది. ఈ ఫోన్లు వరుసగా రూ.37,755, రూ.45,320 ధరలకు వినియోగదారులకు జనవరి నెలలో లభ్యం కానున్నాయి.    అలాగే ఎంపిక చేసిన మార్కెట్లలో వచ్చే నెలలో స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంటుంది. అయితే భారతదేశంలో ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ సంస్థ వెల్లడించలేదు.
Samsung-Galaxy-A8-Plus-2018

అలాగే ధరను అధికారికంగా ప్రకటించక పోయినప‍్పటికి  సుమారు రూ.32వేలు (500 డాలర్లు) ఉండొచ్చని అంచనా. ముందు భాగంలో 16, 8 మెగాపిక్సల్ సామర్థ్యం ఉన్న రెండు సెల్ఫీ కెమెరాలను అమర్చారు. ఇవి పవర్‌ఫుల్ కెమెరాలు కావడం వల్ల ఫొటోలు, వీడియోలు క్వాలిటీతో వస్తాయి. అలాగే ఈ ఫోన్లకు ఐపీ68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను అందిస్తున్నారు. ఫాస్ట్‌చార్జింగ్, శాంసంగ్ పే వంటి ఫీచర్లు కూడా ఈ ఫోన్లలో ఉన్నాయి.  
 


శాంసంగ్ గెలాక్సీ ఎ8 (2018) ఫీచర్లు :

5.6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2220 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

మొత్తం నాలుగు రంగుల్లో..

శాంసంగ్ గెలాక్సీ ఎ8 ప్లస్ (2018) ఫీచర్లు:

6 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1 నూగట్, డ్యుయల్ సిమ్, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 16, 8 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.



మరింత సమాచారం తెలుసుకోండి: