ఈ మద్య టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందింది.  కాలంతో పాటు మొబైల్ ఫోన్ లలో కూడా ఎన్నో మార్పులు చేర్పులు వస్తున్నాయి. ప్రస్తుతం అందరికి స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి..ఇక స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచం మొత్తం మన గుప్పిట్లో ఉన్నట్లే లెక్క.  ఈ మద్య మొబైల్ పరిమాణం కూడా మారిపోతుంది..కొన్ని చిన్నగా, మరికొన్ని పెద్దగా ఇలా అన్ని రకాల మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నాయి.  తాజాగా లండన్ కి చెందిన క్లూబిక్ న్యూ మీడియా కంపెనీ ప్రపంచంలోనే అతి చిన్న మొబైల్ ని మార్కెట్ లోకి తీసుకు వస్తుంది. 
Meet Zanco Tiny t1, world's smallest phone
ప్రపంచంలోనే అత్యంత చిన్నదైన ఫోన్ 'జాంకో టైనీ టీ1'ను జాంకో కంపెనీ విడుదల చేసింది. ఈ ఫోన్ ఎంత చిన్నగా ఉంటుందంటే.. కేవలం ఒక బొటన వేలు పొడవులో మాత్రమే ఉంటుంది. ఇక బరువు ఒక కాయిన్ కన్నా తక్కువే ఉంటుంది. ఈ ఫోన్ కొలతలు 46.7 x 21 x 12 mm గా ఉండగా, బరువు 13 గ్రాములు మాత్రమే. ఈ ఫోన్ ధర రూ.2,280.  జాంకో టైనీ టీ1 ఫోన్‌లో సింగిల్ నానో సిమ్ వేసుకోవచ్చు. ఫోన్‌బుక్‌లో 300 కాంటాక్ట్స్ పడతాయి. 50 ఎస్‌ఎంఎస్‌లు స్టోర్ అవుతాయి. కాల్ లాగ్‌లో 50 ఇన్‌కమింగ్/ఔట్ గోయింగ్ కాల్స్ స్టోర్ అవుతాయి.

ఈ ఫోన్‌లో 32 ఎంబీ స్టోరేజ్‌ను ఏర్పాటు చేశారు. మీడియాటెక్ ఎంటీకే6261డి మదర్‌బోర్డు ఇందులో ఉంది. 32 ఎంబీ ర్యామ్‌ను ఇచ్చారు. 0.49 ఇంచ్ ఓలెడ్ డిస్‌ప్లే, 32 x 64 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్‌ను ఈ ఫోన్ కలిగి ఉంది. ఇందులో 200 ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. ఇందులో 2జీ మాత్రమే పనిచేస్తుంది. బ్లూటూత్, మైక్రో యూఎస్‌బీ, లౌడ్ స్పీకర్లు ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌లో ఇంటర్నెట్ యాక్సెస్ కూడా లేదు. ఇక ఈ ఫోన్ వచ్చే ఏడాది మేలో మార్కెట్‌లో లభ్యం కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: