కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా పంపుకునే మెసేజ్‌ల కార‌ణంగా ప్ర‌ముఖ స‌మాచార స‌ర‌ఫ‌రా యాప్ వాట్సాప్ కొన్ని దేశాల్లో మొరాయించింది.దీంతో దేశ‌వ్యాప్తంగా ఉన్న వినియోగ‌దారులు అస‌హ‌నానికి లోన‌య్యారు. 2018కి స్వాగ‌తం చెప్పేందుకు ఆదివారం సాయంత్రం నుంచి వాట్సాప్ వినియోగ‌దారులు సిద్ద‌మ‌య్యారు. త‌మ స్నేహితుల‌కు విష‌స్ చెప్పేందుకు మిలియ‌న్ల కొద్ది మెసేజ్ ల‌ను షేర్ చేశారు. దీంతో వాట్సాప్ క్రాష్ డౌన్ అయ్యింది. 

వాట్సాప్ మొరాయించ‌డంతో యూకే, భార‌త్ , యూర‌ప్‌, బ్రెజిల్ దేశాల్లో 54 శాతం మందికి క‌నెక్టింగ్, 27 శాతం మందికి మెసేజ్ సెండింగ్, 17 శాతం మందికి లాగిన్ సమ‌స్య‌లు త‌లెత్తాయి. తమ స‌మ‌స్య‌ను ట్వీట్ చేస్తూ  #WhatsAppDown అనే హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండింగ్ చేశారు. ట్వీట్లు చేసిన వారిలో 54 శాతం మందికి క‌నెక్టింగ్ స‌మ‌స్య‌, 27 శాతం మందికి మెసేజ్ పంప‌డంలో స‌మ‌స్య‌, 17 శాతం మందికి లాగిన్ సమ‌స్య‌లు త‌లెత్తిన‌ట్లు డౌన్ డిటెక్ట‌ర్ పేర్కొంది.

అయితే ఈ స‌మ‌స్య‌పై వాట్సాప్ అధికారికంగా స్పందించ‌లేదు.ఒకేసారి వేలాదిగా న్యూఇయర్ మెసేజ్‌లు వెల్లువెత్తడంతో సాంకేతిక సమస్య తలెత్తినట్టు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. రెండు గంటల తరువాత మళ్లీ వాట్సాప్ యధావిధిగా పనిచేస్తోందని, ఎలాంటి సమస్యలు లేవని ప్రకటించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: