స్మార్ట్‌ ఫోన్ల కాలంలో సరికొత్త విప్లవానికి నాందిపలికేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. రిలయన్స్‌ మరో సంచలనానికి తెరతీయబోతుంది. ఎల్‌వైఎఫ్‌ బ్రాండు కింద ఆల్ట్రా లో-ధరతో ఆండ్రాయిడ్‌ గో ఆధారితంగా 4జీ వాయిస్‌ ఓవర్‌ ఎల్టీఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయాలని రిలయన్స్‌ ప్లాన్‌ చేస్తోంది. దేశీయ టెల్కోలకు గట్టి పోటీ ఇచ్చేందుకే రిలయన్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ డివైజ్‌తో మరింత మంది కస్టమర్లను తన సొంతం చేసుకోవాలని చూస్తోంది.

4జీ స్మార్ట్‌ఫోన్లను క్యాష్‌బ్యాక్‌ల ద్వారా రూ.1500 కంటే తక్కువకే ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో జియో కూడా అత్యంత తక్కువ ధరల్లో 4జీ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయాలని చూస్తోంది.  జియోఫోన్‌కు అవలంభించిన విధానాన్నే ఈ స్మార్ట్‌ఫోన్‌కు అనుసరించాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ యోచిస్తున్నట్టు సంబంధిత వ్యక్తులు చెప్పారు. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్‌ రిలయన్స్‌ జియో సిమ్‌తో పాటు, పలు ఆఫర్లతో వినియోగదారుల ముందుకు రానుంది.

ముఖేష్‌ అంబానీకి చెందిన 4జీ టెలికాం ఆపరేటర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్టు  చిప్‌సెట్‌ తయారీదారి మీడియాటెక్‌ ధృవీకరించింది. ఆండ్రాయిడ్‌ గో స్మార్ట్‌ఫోన్‌పై జియో బులిష్‌గా ఉందని, తమతో కలిసి రిలయన్స్‌ పనిచేస్తుందని మీడియాటెక్‌ ఇంటర్నేషనల్‌ కార్పొరేట్‌ సేల్స్‌ కంట్రీ హెడ్‌ కుల్దీప్‌ మాలిక్‌ తెలిపారు. వచ్చే నెలల్లో ఈ డివైజ్‌ను మార్కెట్‌లోకి తీసుకురానున్నట్టు కూడా పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: