టెక్నాలజీ పెరిగిన తర్వాత సోషల్ మాద్యమాలు జోరు ఊపందుకుంది.  ఫేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా ప్రజలు ప్రయోజనం పొందుతున్నారు.  ఇక వాట్సాప్ అయితే స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా వాడుతున్నారు.  మేసేజ్, లింక్స్, ఫోటో షేరింగ్, వీడియో, లైవ్ చాట్, లైవ్ వీడియో ఇలా ఎన్నో సదుపాయాలు వాట్సాప్ లోఉన్నాయి.
Related image
తాజాగా వాట్సాప్ ఓ కొత్త ఫీచర్ ను ఆండ్రాయిడ్ బీటా (పరీక్షించే) వెర్షన్ లో ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ఏమిటంటే... ఎప్పుడైనా మెస్సేజ్ ను మరొకరికి ఫార్మార్డ్ చేస్తే ఆ మెస్సేజ్ ఇప్పుడైతే సాధారణ మెస్సేజ్ లతో కలిసిపోయి ఉంటుంది. కానీ, కొత్త ఫీచర్ లో ఫార్వార్డ్ లేబుల్ తో కనిపిస్తుంది. సాధారణ సందేశాలకు, ఫార్వార్డ్ మెస్సేజ్ లకు మధ్య భేదాన్ని స్పష్టంగా గుర్తించేందుకు గాను ఈ ఫీచర్ ను తీసుకొచ్చింది.

ప్రస్తుతం ఇప్పుడు బీటా వెర్షన్ లోనే ఉండగా, త్వరలోనే ఆండ్రాయిడ్, ఐవోఎస్ రెగ్యులర్ వెర్షన్ లో ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ పై వాట్సాప్ కొన్ని నెలలుగా పనిచేస్తుందని సమాచారం. ఫార్వార్డ్ చేసిన మెస్సేజ్ లేబుల్ తో పాటు సింబల్ రూపంలో కనిపించడమే ఈ ఫీచర్ ప్రత్యేకత.


మరింత సమాచారం తెలుసుకోండి: