అవును భారత దేశంలో కొంత మంది వాట్సాప్ వినియోగదారులకు షాకింగ్ న్యూస్..పాత ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ వెర్షన్లతో కూడిన మొబైల్స్ కు వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. ఆండ్రాయిడ్ 2.3.3 కంటే ముందు వెర్షన్లు, విండోస్ 8.0, దానికంటే పాత వెర్షన్లు, ఐవోఎస్ 6, సింబియాన్ ఎస్60, బ్లాక్ బెర్రీ ఓఎస్, బ్లాక్ బెర్రీ 10 ఓఎస్ ఉన్న ఫోన్లకు ఇకపై వాట్సాప్ సపోర్ట్ చేయదు. 

అంతే కాదు ఈ జాబితాలోకి మరికొన్ని ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్లకు లేటెస్ట్ వాట్సాప్ ఇన్ స్టలేషన్ ను ఇకపై అనుమతించడం లేదని వాట్సాప్ తెలిపింది. కాకపోతే  ఆయా వెర్షన్లపై ఇప్పటికే వాట్సాప్ వాడుతున్న వారు మరికొంత కాలం పాటు ఆ సేవలు పొందొచ్చని స్పష్టం చేసింది.

నోకియా ఎస్40 కలిగి ఉన్న వారు ఈ ఏడాది డిసెంబర్ చివరి వరకు, ఆండ్రాయిడ్ 2.3.3, 2.3.7 ఉన్నవారు 2020 ఫిబ్రవరి 1 వరకు, ఐవోఎస్ 7 యూజర్లు 2020 ఫిబ్రవరి 1 వరకు వాట్సాప్ సేవల్ని పొందొచ్చని తెలియజేసింది. వాట్సాస్ సేవల కోసం యూజర్లు తదుపరి వెర్షన్లకు అప్ గ్రేడ్ కావాలని సూచించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: