ప్రముఖ మెసేజింగ్‌ మాధ్యమం వాట్సప్‌కు కిల్లర్‌గా దూసుకొచ్చిన రాందేవ్ బాబా స్వదేశీ యాప్ పూర్తి స్తాయి లాంచింగ్ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.  ఈ నెలలోనే ఈ కింభో యాప్‌ కస‍్టమర్లకు అందుబాటులోకి రానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పతంజలి  సంస్థ సీఈవో ఆచార్య బాలకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ ఖాతాలో ఒక మెసేజ్‌ పోస్ట్‌ చేశారు. కొత్త, ఆధునిక ఫీచర్లు కింభో యాప్‌ లాంచింగ్‌కు సిద్ధంగా ఉన్నామంటూ ట్వీట్‌ చేశారు.

ఆ మద్య ఈ యాప్‌ చాలా బగ్స్‌తో కూడుకుని ఉందని, యూజర్లు ఈ యాప్‌ వాడుతూ పంపించుకున్న మెసేజ్‌లన్నీ తాను యాక్సస్‌ చేయగలుగుతున్నానని పేర్కొన్నారు.  ఈ నేపథ్యంలో పతంజలి కమ్యూనికేషన్స్‌ కూడా ఈ బగ్స్‌ను ఫిక్స్‌ చేయడంతోనే కింబో యాప్‌ను డిలీట్‌ చేసినట్టు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే..కింభో యాప్‌ను ఆగష్టు 27, 2018 న ప్రారంభించనున్నామని బాలకృష్ణ ట్వీట్‌ చేశారు. ఈ యాప్‌ ట్రయిల్‌ వెర్షన్‌ను ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.  అంతేకాదు లాంచింగ్‌కు  ముందే యూజర్లు తమ సలహాలు, సూచనలు అందించాలని కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: