అతి తక్కువ ధరలో ‘డీటెల్‌ ఒక ఫీచర్‌ఫోన్‌ ను ఈరోజు విడుదల చేసింది. దేశీయ మొబైల్స్‌ తయారీదారు డీటెల్‌ కొత్త ఫిచర్‌ ఫోన్‌ ‘డి 1స్లిమ్‌ పేరుతో లాంచ్‌ అయింది.  దేశీయ మొబైల్స్‌ తయారీదారు  డీటెల్‌ కొత్తఫీచర్‌ ఫోన్‌ కొత్తదనంతో మార్కెట్ లోకి వచ్చింది.  డీ1కు సక్సెసర్‌గా తీసుకొచ్చన ఈ ఫీచర్‌ ఫోన్‌లో డిజిటల్‌ కెమెరా విత్‌ ఎల్‌ ఈడీ ష్లాష్‌ ప్రత్యేకత అని కంపెనీ చెబుతోంది.

detel

ఈ ఫోన్‌ గతంలో రూ.299 లకే డీ1 ఫీచర్‌ ఫోన్‌ తీసుకొచ్చిన కంపెనీ భారతదేశంలో అతి తక్కువ విలువైన మొబైల్‌ ఫోన్‌ తమదే అని ఆ కంపెనీ పేర్కోంది. అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు, డిజైన్‌తో  డీ1స్లిమ్‌ ఫీచర్‌ ఫోన్‌ మార్కెట్‌లో కొత్త ఒరవడిని సృష్టించనుందని డీటెల్‌ ఎండీ యోగేష్‌ భాటియా తెలిపారు.

Image result for Detel phone

బీటుబీ అడ్డా వెబ్‌సైట్‌లో ఈఫోన్‌ లభించనుంది.  బ్లూ,  గోల్డ్‌, పింక్‌ - మూడు కలర్ వేరియంట్లలో లభించనుంది.  2.8 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే, మైక్రోఎస్డీ కార్డు ద్వారా 16 జీబికి స్టోరేజ్‌ విస్తరణ, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీవిస్తరించగల సామర్ధ్యం ఈ ఫోన్‌లో జోడించింది. ఈ ఫీచర్‌ ఫోన్‌ ధర 1199 రూపాయలు.


మరింత సమాచారం తెలుసుకోండి: