ప్రపంచ వ్యాప్తంగా ఇప్పడు ఒప్పో ఫోన్లకు బాగా డిమాండ్ పెరుగుతూ వస్తుంది. సరికొత్త టెక్నాలజీతో నూతన వొరవడి సృష్టిస్తుంది ఒప్పో.  తాజాగా ఒప్పో త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ ఎ1కె ను భార‌త్‌లో ఇవాళ విడుద‌ల చేసింది. రూ.8490 ధ‌ర‌కు ఈ ఫోన్ వినియోగ‌దారుల‌కు ల‌భిస్తున్న‌ది. ఇందులో ప‌లు ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు.


ఒప్పో ఎ1కె ఫీచ‌ర్ల విషయానికి వస్తే..

6.1 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1560 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్ష‌న్‌, ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0 పై, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, డ్యుయ‌ల్ సిమ్‌, డ్యుయ‌ల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌.




మరింత సమాచారం తెలుసుకోండి: