ఎన్టీఆర్ కథానాయకుడు పరిస్థితి విచిత్రంగా ఉంది. ఈ సినిమాకు పబ్లిక్ టాక్, రివ్యూలు అన్నీ బాగానే వచ్చాయి.. దీన్ని బట్టి చూస్తే కలక్షన్ల వర్షం కురుస్తుందనే అంతా అనుకున్నారు. ఈజీగా వంద కోట్లు వసూలు చేస్తుందని ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ ఇప్పుడు సీన్ చూస్తే పూర్తి రివర్స్ గా ఉంది.



ప్రస్తుతం ఈ సినిమా వసూళ్లు బాగా పడిపోయాయి. లాభాలు తెచ్చి పెడుతుందనుకున్న సినిమా కాస్త బ్రేక్ ఈవెన్ దాటడమే కష్టం అంటున్నారు. పలు ప్రాంతాల్లో భారీ నష్టాలు మూటగట్టుకుంటోందని ఓ ఆంగ్ల పత్రిక కథనం వెలువరించడం విశేషం.



సాధారణంగా బాలయ్య హీరోగా నటిస్తాడు కానీ స్వయంగా చిత్ర నిర్మాణానికి దిగడు. నిర్మాతగా మారితే తనకు అచ్చిరాదని బాలయ్యకు ఓ సెంటిమెంట్ ఉందని ప్రచారం ఉంది. అయినా సరే ఆ నమ్మకాన్ని పక్కకుపెట్టి ఈసారి తండ్రి సినిమా తానే సొంతంగా నిర్మించాడు. సెంటిమెంట్లను, నమ్మకాలను బాగా నమ్మే బాలయ్య.. ఈ సినిమా కోసం వాటిని పక్కకు పెట్టినా ఫలితం అంతగా కనిపించలేదు మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: