సొంతకాళ్లపై నిలబడాలనుకునే మహిళలకు ఇది ఓ మంచి అవకాశం.. ఉచితంగా స్వయం ఉపాధి కోర్సుల్లో శిక్షణ అందించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ. యూనివర్సిటీ ఆవరణలోని దుర్గాబాయి దేశ్ ముఖ్ మహిళా సభ లిటరసీ హౌస్ ఈ అవకాశం కల్పిస్తోంది. మహిళలకు ఎంఎస్ ఆఫీస్, ట్యాలీ ఈఆర్‌, డీటీపీ, మగ్గం తదితరకోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

 

ఆసక్తి ఉన్నవారు.. ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఉచిత బ్యూటీషియన్ కోర్సులో అడ్మిషన్ కోసం ఈ నెల 26న కార్యాలయంలో సంప్రదించాలన్నారు. 9951210441, 8498080599 నంబర్లను సంప్రదించాలని సూచించారు

 

అదే సమయంలో… సెంటర్ ఫర్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో రెండు నెలల వ్యవధి ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 27 నుంచి ఉదయం, సాయంత్రం తరగతులు నిర్వహిస్తారు. వివరాలకు 96528_56107, 7416 575575 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు. మీకు ఆసక్తి ఉంటే.. కెరీర్ లో దూసుకెళ్లేందుకు ఇవి  మంచి అవకాశాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: