మహిళ ఉద్యోగం కోసమో.. ఉపాధి కోసమో ఇంటి నుంచి బయటకు వస్తే చాలు వేధించేందుకు గుంటనక్కలు కాచుకుని ఉంటారు. పదిహేనేళ్ల బాలికైనా.. 50 ఏళ్ల మహిళ అయినా వదలిపెట్టరు. అయితే ఇప్పుడు ఈ వేధింపులపైనా అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇటీవల షాహీన్ మహిళా సంక్షేమ సంఘం ఆద్వర్యంలో జరిగిన ఒక అధ్యయనం నిర్వహించింది.

 

 

ఇందులో తేలిందేమంటే.. తక్కువ జీతం అందుకునే మహిళలకు ఎక్కువగా వేధింపులకు గురవుతున్నారట. హైదరాబాద్ పాతబస్తీ లో తక్కువ వేతనం పొందే మహిళలకు ఎక్కువ లైంగిక పరమైన వేధింపులు ఎదురవుతున్నాయి. వంద మంది మహిళలను ఈ సంస్థ వారు ప్రశ్నింస్తే.. వీరు పలు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.

 

 

తక్కువ ఆదాయం ఉన్న మహిళల్లో 80 శాతం మంది లైంగిక వేధింపులకు గురవుతున్నారట. కుటీర పరిశ్రమలు, సేల్స్ ఉమన్, రోజూవారి వేతనానికి పని చేసేవారు.. ఇళ్లలో పనులు చేసేవారికి పురుషుల నుంచి ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. తక్కువ చదువుకుని ఉండటం... వేధింపులపై ఎలా ఫిర్యాదు ఇవ్వాలో కూడా తెలియకపోవడం కూడా వీరిపై వేధింపులకు కారణంగా చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: