ఇప్పుడు అసలు రోజులు బాగాలేదు. కాలు తీసి బయట పెట్టాలంటే చాలు వణికిపోతున్నారు.కరోనా భయంతో అందరు ఇంటికే పరిమితం అయ్యారు. అయితే ఈ కరోనా వైరస్ వల్ల గర్భిణీ స్త్రీ లకు చాలా ప్రమాదం ఉంది.అందుకే గర్భిణీలు  తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి గంటకు  సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఎక్కడ తాకుతారో తెలియదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో గర్భిణులు అతి జాగ్రత్తగా వుండాల్సిందే. కళ్ళు, ముక్కు, నోరు ద్వారానే వైరస్‌ సోకే అవకాశం వుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో  బయట ప్రదేశాలకు వెళ్ళకుండా చూసుకోవాలి.

 

అపార్ట్‌మెంట్లోనే, బయట గాలికి నిలబడాలన్నా మాస్క్‌ కట్టుకోవడం మంచిది. మాస్కులు అంటే సర్జికల్‌వే అవసరం లేదు. కర్చీఫ్‌ లాంటివి కట్టుకున్నా సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు గాలి ద్వారా కూడా వైరస్‌ సోకే అవకాశం వుందని ఈ మధ్య రుజువయింది. కాబట్టి మన జాగ్రత్తలో మనం వుంటే మంచిది. అలాగే
వీలైనంత వరకు రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవాలి. వాటిలో ప్రోటీన్లు ఎక్కువగా వుండేలా చూసుకోవాలి. గుడ్లు, మాంసం, పాలు, పెరుగు, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఆకుకూరలు, కొద్దిగా పండ్లు తీసుకుంటే సరిపోతుంది. పచ్చివి, వుడకబెట్టనివి అస్సలు తినకూడదు. బయట నుండి ఏం తెచ్చుకున్నా గోరు వెచ్చని నీళ్ళలో శుభ్రం చేసి వాడుకోవాలి. మరీ ముఖ్యంగా అనవసరంగా ఆందోళన పడొద్దు.

 

పూర్వకాలంలో ఎలాంటి డాక్టర్లు లేకుండా సుఖంగా ప్రసవాలు జరిగేవి. ఇప్పుడు ఈ కార్పొరేట్‌ ఆస్పత్రులు వచ్చాక మాటి మాటికి టెస్టులనో, స్కానింగులనో రమ్మనడం వల్ల వెళ్ళకపోతే ఏమౌతుందో అని చాలా మంది ఆందోళన పడుతున్నారు. మంచి ఆహారం తీసుకుంటూ, ప్రశాంతంగా ఉంటూ, పరిశుభ్రత పాటిస్తే ఎలాంటి సమస్య వుండదు. 
బీపీతో పాటు కాళ్ళవాపు వున్నా,
థైరాయిడ్‌ వున్న వారు వుంటే చివరి వరకు ఆ మందులు కొనసాగించాలి. బీపీ చూసుకునేందుకు హాండ్‌మేడ్‌ చెకప్‌లు వున్నాయి. అవకాశం వున్న వారు ఇంట్లో చూసుకుంటే సరిపోతుంది.

 

అయితే మరో సమస్య ఏమిటంటే సాధారణంగా ఈ సమయంలో కాళ్ళ వాపు వస్తుంది. కాళ్ళు పైకి పెట్టుకుని పడుకుంటే సమస్య తగ్గిపోతుంది. బీపీ లేకపోతే దీని వల్ల పెద్ద సమస్య ఏమీ వుండదు. అదే బీపీ వుండి కాళ్ళ వాపు ఇబ్బంది పెడుతుంటే కచ్చితంగా డాక్టర్‌ సలహా తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో గర్భిణీలు బయటకు వెళ్ళ కూడదు. ఎవైనా అత్యవసర వస్తువులు తెచ్చుకోవాలనుకుంటే ఇంట్లో వున్న వారిని పంపాలి తప్ప వీరు మాత్రం అస్సలు వెళ్ళ కూడదు. అలాగే ఇంట్లో వారు ఉద్యోగ రీత్యా బయటకు వెళ్ళాల్సి వస్తే అలాంటి వారికి దూరంగా వుండాలి.

 

ఎలాంటి వైరస్‌ లేకపోయినా ముందు జాగ్రత్తగా దూరంగా వుంటేనే మంచిది. అలాగే కరోనా లక్షణాలు కనిపించినా.. రక్తస్రావం, ఉమ్మనీరు పోవడం, కాళ్లు, ముఖం వాపులు, విపరీతమైన తలనొప్పి, బిడ్డ కదిలికలు సరిగ్గా తెలియకపోవడం వంటి లక్షణాలు ఉన్నా, పురిటి నొప్పులు మొదలైనా 108 వాహనం లేదా వైద్యులను సంప్రదించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: