సృష్టిలో  ప్రతి ప్రాణి కి మూల కారణం అమ్మ కన్న బిడ్డను 9నెలలు గర్భంలో మోసి తనకి ఎంత బాధ ఉన్నా ఆ బిడ్డని ప్రేమగా ఇష్టంగా జన్మనిచ్చే ప్రేమమూర్తి అమ్మ.ఆ తర్వాత పాలు తాగించి,గోరు ముద్దలు  తినిపించి ఎంతో ప్రేమగా ఆ బిడ్డను లాలించి పెంచుతుంది.అందుకే తల్లిని మించిన ప్రేమమూర్తి మరొకరు ఈ ప్రపంచంలో లేరు అంటే అతిశయోక్తి కాదు.ప్రపంచంలో కెల్లా తీయనైన పదం అమ్మ. అమ్మ ప్రేమ కంటే గొప్పప్రేమ ఏది లేదు. అమ్మచూపించే భద్రత,  అమ్మ మన పట్ల తీసుకునే బాధ్యతని ఈ ప్రపంచంలో  ఎవరు తీసుకోలేరు. అందుకే తల్లిని  ప్రేమను మించిన దైవం ఉండదు అని అంటారు. అమ్మ అనే పదం నోరులేని ప్రాణికైనా, మానవుల కైనా అతి ముఖ్యమైనది.

 

మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం కుటుంబములో అమ్మకు తనకంటూ ఒక స్థానము వుంది.నవమాసాలు ప్రేమతొ మోసి తన బిడ్డకు జన్ననిస్తుంది అంటే తాను మరుజన్మ ఎత్తినట్లే.అమ్మ ప్రేమకు తమ పిల్లల పట్ల అవధులు వుండవు .తన పిల్ల వాడు తప్పు చేసిన సమర్థించుకునే గుణం అమ్మలో మాత్రమె వుంది.ఏ కొంతమంది లో తప్ప చాలా మంది తల్లిదండ్రుల తమ పిల్లలను ఆడ,మగ తారతమ్యం లేకుండా స్వచ్చమైన ప్రేమను పంచుతారు.మన భారతీయ సంస్కృతి ప్రకారం సృష్టికి మూలం స్త్రీ అని పురాణాలు ద్వారా మనకు తేలిసిన విషయమె..అమ్మ యొక్క ఔన్నత్యాన్ని పురాతన కాలం నుంచి మన కవులు రచయితలు, ఋషులు చక్కగా వివిధ పుస్తకాలలో వర్ణించారు.

 

అమ్మ తన పిల్లల ఎదుగుదల ప్రతి నిమిషం అనురాగం పంచుతూ గమనిస్తూనే వుంటుంది.ఉదయము మొదలు రాత్రి నిద్రించు వరకు అమ్మ ప్రేమ పిల్లల చదువు సంస్కారం నేర్పించడము వైపే ఆశక్తి వుంటుంది.పిల్లలకి తమ తల్లి దైవంతొ సమానం అనుటలో అతిశయోక్తి లేదు.కొన్ని కొన్ని సందర్భాల్లో పేదరికంలో మగ్గుతున్న తల్లి తాను తినుటకు అన్నము లేకపోయినా తమ పిల్లలు పస్తు వుండకూడదనే బావనతొ తాము తినక పిల్లలకు మాత్రమే తినిపించిన రొజులు కొకొల్లలుగా ఉన్నాయి.  మనము పేద కుటుంబాలలో తరచూ చూస్తూనే వున్నాం.అలాంటి సందర్భాల్లో మన మనసు ఎంతో బాదపడుతుంది.అమ్మ తనకి లేకపోయినా పిల్లల సంతోషాన్ని కోరుకుంటుంది.మనం ఎవరికన్నా ఋణం ఉన్నాము అంటే ఈ ప్రపంచంలో అమ్మకి మాత్రమే...

 

మరింత సమాచారం తెలుసుకోండి: