ఒక బిడ్డకు జన్మనివ్వడం స్త్రీకి పునర్జన్మ లాంటిది. తాను అనుభవించిన వేదనంతా మరిచిపోయి బిడ్డ పుట్టగానే ఎంతో అనుభూతి పొందుతుంది. స్త్రీ 'అమ్మ'గా రూపాంతరం చెందుతుంది. బిడ్డ పుట్టిన వెంటనే అన్ని అవయవాలు సరిగా ఉన్నాయా లేదా అని బిడ్డని తరిమి తరిమి చూసుకుంటుంది. వెంటనే బిడ్డని చూసుకుని ఆ తల్లిదండ్రులు నీపోలికా...? నా పోలికా...?ఎవరి పోలిక వచ్చిందని అనుకోవడం సహజం. తల్లి మాత్రం ఎవరి పోలికైనా పరవాలేదు. లోపా లేవీ లేవని తృప్తి పొందుతుంది. అది తల్లి అంటే. బిడ్డ రూపు, రంగు,ఆడ, మగ అని  ఏవి చూడదు.

 

 

 

ఎంతయినా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ కదా.. అమ్మ మాత్రమే చనుబాలు అందిస్తుంది. కొందరు ఆడపిల్ల పుట్టితే అసాహనానికి గురవుతారు. అదే మగపిల్లవాడనగానే ఎగిరి గంతేస్తారు. అమ్మ మాత్రం లోపలి పేగుబంధములో మెదిలే  బంధంతో' ఏ పసికూనయైన నొకటే అని పలుకడం లోకసహజం. పాప కాని బాబు కాని నవ్వితే అమ్మకు ఒక పండుగ, బోర్ల పడ్డనాడు ఇరుగు పొరుగు వారే కాక ఎవ్వరు కన్పించినా అదే విషయాన్ని ప్రస్తావిస్తుంది. బిడ్డ ఎదిగి బుడి బుడి అడుగులు వేస్తుంటే చూసి మురిసిపోతుంది. అమ్మ అని తొలి పిలుపు బిడ్డ నోటి వెంట పలికినపుడు ఎదో తెలియని పరవశంతో ఉబ్బి తబ్బిబ్బు అయిపోతుంది. 

 

 

 

ఎంత ఎత్తు ఎదిగినా తల్లికి కొడుకే కాబట్టి ప్రతి తల్లి పిల్లతనము మాని వంశ గౌరవప్రతిష్ఠలకు భంగం కల్గకుండా కన్న తల్లి దండ్రులకు అప్రతిష్ఠ రాకుండా తన కొడుకు వ్యవహరించాలని కోరుకుంటుంది. మరీ ముఖ్యంగా నాన్నగారి గౌరవానికి ఎలాంటి లోటు రాకూడదని కోరుకుంటుంది. ఎందుకంటే ఈ సమాజం బిడ్డ తప్పు చేస్తే మొదట నిందించేది కన్న తల్లినే. ఏమి పెంపకం పెంచావు అని తల్లిని దూషిస్తారు. ఏ తల్లి కూడా బిడ్డ ఎదుగుదలను కోరుకుంటుంది. కానీ. బిడ్డ యొక్క పతనాన్ని కాదు. తల్లి బిడ్డల్ని సక్రమంగానే పెంచుతుంది. నీతి నిజాయతి, మంచి, చెడు అన్ని నేర్పిస్తుంది. కానీ వయసు పెరిగేకొద్దీ తల్లి మాట లెక్కచేయని పిల్లలు వాళ్ళ ఇష్టానుసారముగా తమకు తోచింది చేస్తున్నారు. ఆ పని చేసేముందు మంచి, చెడు అన్ని విస్మరిస్తున్నారు. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి మనం ఎలాంటి తప్పు చేసిన ఆ ప్రభావం పెంచిన తల్లి మీద పడుతుందని..

మరింత సమాచారం తెలుసుకోండి: