గ్రీన్ టీ గూర్చి తెలియని వారు ఉండరు. అయితే ఈ గ్రీన్ టీ వల్ల ఆడవాళ్లకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరే  గ్రీన్ టీ తీసుకోడం మొదలుపెడతారు. అయితే  మీకు గ్రీన్ టీ రుచి న‌చ్చ‌క‌పోతే ఎలా అనుకుంటున్నారా? ఏం ఫ‌ర్వాలేదు. ఈ ఆకుల‌ను పేస్ట్ చేసి ఆ పేస్ట్‌ని ముఖానికి రుద్దుకుంటే సరి. ఇది మీ చ‌ర్మాన్ని అద్భుతంగా మార్చేస్తుంది. దీనివ‌ల్ల మ‌న చ‌ర్మం, జుట్టుకి క‌లిగే ప్ర‌యోజ‌నాల గురించి తెలుసుకుందాం రండి..గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్లు, ట్యానిన్లు క‌ళ్ల కింద ఉన్న ర‌క్త‌నాళాలు ఉబ్బ‌డాన్ని త‌గ్గిస్తాయి. ఫ‌లితంగా క‌ళ్ల కింద లావుగా ఉన్న భాగం తిరిగి మామూలు స్థితికి చేరుకుంటుంది.

 

 

 

అంతేకాదు  ఇందులోని విట‌మిన్ కె క‌ళ్ల కింద న‌ల్ల‌ని వ‌ల‌యాల‌ను కూడా త‌గ్గిస్తుంది. ఇందుకోసం గ్రీన్ టీ బ్యాగ్‌ల‌ను ఫ్రిజ్‌లో ఓ గంట పాటు ఉంచి ఆ త‌ర్వాత దాన్ని క‌ళ్ల‌పై అరగంట పాటు ఉంచుకోవాలి. ఇలా వారానికి ఓసారి చేస్తే చాలు.. క‌ళ్లు మెరిసిపోతాయి.అలాగే  ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ల వ‌ల్ల `మీ చ‌ర్మంపై ఉన్న మ‌చ్చ‌లు, ముడ‌త‌లు, ట్యాన్‌, పిగ్మంటేష‌న్ వంటివ‌న్నీ త‌గ్గిపోతాయి. ఇందుకోసం మ‌ట్చా గ్రీన్ టీని పేస్ట్ చేసుకొని అందులో కొద్దిగా కొబ్బ‌రి నూనె వేసి బాగా క‌లిపి ముఖానికి ప‌ట్టించండి. దీన్ని 20 నిమిషాల పాటు ఉంచుకొని త‌ర్వాత గోరువెచ్చ‌ని నీటితో క‌డిగేస్తే స‌రి.గ్రీన్ టీ చ‌ర్మాన్ని మృదువుగా, కాంతిమంతంగా మారుస్తుంది. ఇది న‌ల్ల‌మ‌చ్చ‌లు, మొటిమ‌లను త‌గ్గిస్తుంది. ఇందుకోసం రోజూ గ్రీన్ టీని తాగ‌డంతో పాటు టీ ఆకుల‌ను పేస్ట్ చేసి తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి ఈ ప్యాక్‌ని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచుకుని క్లీన్ చేసుకుంటే  సరిపోతుంది.

 

 

 

గ్రీన్ టీ తాగ‌డం ద్వారా మీ చ‌ర్మంపై ఎక్కువ‌గా విడుద‌ల‌వుతున్న జిడ్డును కంట్రోల్ చేయ‌వ‌చ్చు. గ్రీన్ టీ జిడ్డును త‌గ్గించి మెరిసే చ‌ర్మాన్ని అందించ‌డంతో పాటు చ‌ర్మాన్ని మృదువుగా మారుస్తుంది. గ్రీన్ టీలో యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ గుణాలు ఎక్కువ‌గా ఉంటాయి. గ్రీన్ టీతో త‌యారుచేసిన ఉత్ప‌త్తుల‌ను ఉప‌యోగిస్తే సూర్య‌కాంతి నుంచి అవి మ‌న చ‌ర్మాన్ని కాపాడుతాయి. ఇవి రాషెస్‌, కాలిన గాయాల నుంచి కూడా కాపాడుతాయి. చ‌ర్మానికి తేమ‌ను అందించి ఆరోగ్యంగా మారుస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: