గతంలో స్త్రీలు వంటింటికే పరిమితం  అయ్యేవారు. ఇంట్లో తప్ప బయటకు వచ్చే వాళ్ళు కాదు ఆడవాళ్లు.ప్రస్తుత రోజుల్లో అయితే మహిళలు అన్నింటిలోనూ ముందుంటున్నారు. ఉదాహరణకు కుంటుంబం మరియు ఉద్యోగం, కెరీర్ అభివృద్ధిని నిర్వహిస్తున్నారు. అయితే కుటంబం, పనిఒత్తిడిలు, కెరీర్ మీద ఎక్కువ ద్యాస పెట్టడం వల్ల ఈ రోజుల్లో మహిళలు వారికి తెలియకుండానే ఊబకాయం మరియు చాలా పూర్ ఫిట్నెస్ వంటి సమస్యలకు బాధితులవుతున్నారు. దానికి తోడు, వ్యాయామం చేయకపోవడం, మరియు సరైన బౌతిక అంశాలు చేయకపోవడం వల్ల చాలా మంది మహిళలను అనేక రకాలుగా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటుర్నారు.

 

 

 

అదే సమయంలో పనిచేసే మహిళలు ఫిట్ గా ఉండటం కోసం వ్యక్తిగతంగా మరియు వృత్తి పరంగా, డైట్ పరంగా అంత సులువైన పని కాదు.మీకు రోజంతా స్నాక్స్ తినే అలవాటుంటే, ఆరోగ్యకరమైన స్నాక్స్ కు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. కాబట్టి, అన్నీ హెల్తీ స్నాక్స్ ను మాత్రమే నిల్వ చేసుకోవాలి.మీకు సౌకర్యంగా ఉండే వ్యాయామాన్ని మీరు ఎంపిక చేసుకోవాలి. అందులో ముఖ్యంగా మీకు చాలా సులభంగా, తేలికగా ఉండి, బరువు తగ్గించే వ్యాయామాలు, నడక మరియు పరుగు వంటి వాటిని ఎంపిక చేసుకొని  రెగ్యులర్ గా చేయడం మొదలు పెడితే మంచి ఫలితం ఉంటుంది.ఉద్యోగం చేసే మహిళలు ఖచ్చితమైనటువంటి ఫర్ ఫెక్ట్ డైట్ ను పాటించాలి. కాబట్టి, మీ రెగ్యులర్ డైట్ లో ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ లో తాజా పండ్లు చేర్చుకోవాలి.

 

 

 

వీటి వల్ల తాజా పండ్లను తీసుకోవడం వల్ల మీరు స్వీట్స్ తినాలనే కోరిక దూరం చేస్తుంది.ప్రతి రోజూ శరీరానికి సరిపడా నీళ్ళు త్రాగాలి. శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరగాలంటే తప్పనిసరిగా సరిపడా నీళ్ళు త్రాగాలి.మీరు ఒంటరిగా పనిచేయడానికి బోర్ గా భావిస్తుంటే, మీ బెస్ట్ ఫ్రెండ్ ను ఆహ్వానించండి లేదా మీకు ఇష్టమైన మీ పెట్ ను మీ వెంట తీసుకెళ్ళండి. ఇతరులతో పనిచేయడం వల్ల మీరు మీ ఉన్నత స్థాయిలను చేరుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహాయపడుతాయి.మీరు కూర్చొనే భంగిమ మీద చాలా శ్రద్ద పెట్టాలి. మీరు కూర్చునే విధానంలో చాలా సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి.లేదంటే నడుము నొప్పి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.అప్పుడపుడు కొంచెం కుర్చీలో నుంచి లేచి అటు ఎటు కొంచెం సేపు నడవండి. అస్తమానం అలానే కూర్చుంటే శరీరానికి మంచిది కాదు..

మరింత సమాచారం తెలుసుకోండి: