సోషల్ మీడియా చేసే అద్భుతాలు సామాన్యమైనవి కావు. సామాన్య వ్యక్తిని ఓవర్ నైట్ స్టార్ గా మార్చేస్తుంది. లైఫ్‌ ని ఒక్క పూటలో మలుపుతిప్పుతుంది. ప్రియావారియర్ నుంచి, డాన్సింగ్ అంకుల్, ఆర్సీబీ గాళ్ దీపికఘోష్ వరకు ఎందరో ఒక్క వీడియోతో దేశమంతా అభిమానుల్ని సంపాదించుకున్నారు. చిన్న వీడియో చాలు, నాలుగుమాటల ట్వీట్ చాలు... నలుగురి దృష్టిలో పడటానికి..ప్రపంచానికి మనం ఉన్నామని తెలియటానికి. ఒకప్పుడు ప్రజల్లోని టాలెంట్ అంతా హిడెన్ గా ఉండిపోతూ అలాగే జీవితాలు ముగిసేవి. కానీ, ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లు, సోషల్ మీడియా వచ్చిన తర్వాత.. టాలెంట్ ఎవరి సొత్తూ కాదు.. గుర్తింపు ఎవరి పేటెంట్ కాదని తేలిపోయింది. మనలో విషయం ఉందా లేదా.. బస్. గుర్తింపు దానికదే పరిగెత్తుకొస్తుంది. ఎటొచ్చీ, సరైన  ప్రయత్నం ఒకటి చేస్తే చాలు. తెలుగు నేలపై ఫేస్ బుక్ వీడియోతో బేబీ అనే గాయని సంపాదించిన పాపులారిటీ సామాన్యమైనదేం కాదు. సామాన్య ప్రజలనుంచి, మ్యూజిక్ డైరెక్టర్ల వరకు ఆమెను గుర్తించారు.

ఇప్పుడు లేటెస్ట్ గా ఓ బెంగాల్‌ మహిళ పాడుతున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. పశ్చిమ బెంగాల్, రానాఘాట్‌ రైల్వేస్టేషన్ లో ఆమె పాడుతుండగా తీసిన వీడియో బాలీవుడ్ ప్రముఖుల దృష్టిని కూడా చేరింది. ఎవరీ మహిళ, ఏమిటామె బ్యాగ్రవుండ్ అని వెతకటం మొదలు పెట్టాడు. ఆమె పేరు రణు మొండల్. బెంగాల్ లోని కృష్ణా నగర్ లో పుట్టి పెరిగింది. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని బంధువుల దగ్గర పెరిగింది. ఇప్పుడు కడు పేదరికంలో ఒంటరిగా బతుకుతోంది. ఆమె పాటను గమనించిన ఓ ఇంజనీర్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయటంతో రాత్రికి రాత్రే పాపులారిటీ వచ్చేసింది. ఈ వీడియోని వేలాది మంది షేర్లు చేశారు. లక్షలమంది లైక్ కొట్టారు. ఫేస్ బుక్ తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో కూడా పాపులర్ అయింది. అవకాశాలూ వెల్లువెత్తుతున్నాయి. టీవీ ప్రోగ్రామ్ లు, రియాల్టీ షోల నుంచి పిలుపు కూడా వస్తోంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: