సాధారణంగా ప్రతి ఒక్కరూ ఉప్మా అంటే తెలియని వారు ఉండరు..ఇక ఉప్మా ఎన్నో రకాలుగా తయారు చేసుకోవచ్చు..ఈజీగా త్వరగా తయారయ్యే స్నాక్ ఉమ్నా. ఉమ్మా, ఓట్స్ కాంబినేషన్ అయితే చాలా రుచికరం ఆరోగ్యం కూడా. ఓట్స్ ఉప్మా ఎలా తయారు చేస్తారో చూద్దామా..!

కావాలసిన పధార్థాలు : రెండు కప్పులు ఓట్స్, ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, రెండు టీ స్పూన్లు శనగపప్పు, ఒక టీ స్పూన్ అల్లం ముక్కలు, కరివేపాకు, చిటికెడు, ఇంగువ, ఒక టీ స్సూన్ ఆవాలు, మూడు పచ్చిమిరపకాయులు, రెండు ఎండు మిరపకాయలు, ఒక ఉల్లిపాయలు, ఒక టీ స్పూన్ నూనె, నాలుగున్నర కప్పులు నీరు, తగినంత ఉప్పు.


 తయారు చేసే విధానం : పాన్ లో మూడు నిమిషాలపాటు ఓట్స్ వేయించి పక్కన పెట్టుకోండి. పాన్ లో అతి కొద్ది నూనె వేడిచేసి, మినపప్పు శనగపప్పు, ఆవాలు, పచ్చిమిరిపకాయ ముక్కలు, ఎండు మిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఉల్లి, అల్లం ముక్కలు కరివేపాకు కూడా వేయాలి. ఉల్లిపాయలు వేగాక ఇంగువ, ఉప్పు కలిపి నీరు పోసి మరిగించాలి. ఓట్స్ వేసి, నీరంతా పీల్చేదాకా సన్నని సెగపై ఉడికించాలి. ఇక మీరు కోరే రుచికర ఓట్స్ ఉప్మా రెడీ. ఇది డయాబెటిక్స్ కు ఇది మంచి ఆహారం .  

మరింత సమాచారం తెలుసుకోండి: