కావాలసిన పధార్థాలు : పిండి తయారీకి కావాలసినవి :  మైదా :4 కప్పులు  నూనె :1/4 కప్పు  బేకింగ్ పౌడర్ : ¼ చెంచా వంటసోడా :1/2 చెంచా కొంచెం మైదా : పైన చల్లడానికి ఉప్పు, నీరు : సరిపడ స్ర్పింగ్ రోల్స్ కు కావాలసిన మొదటి పేస్టు : నూనె : 8 చెంచాలు మైదా : 6 చెంచాలు స్ర్పింగ్ రోల్స్ కు కావాలసిన రెండవ పేస్టు : నీరు, 4 చెంచాలు మైదా : 6 చెంచాలు స్ర్పింగ్ రోల్స్ కు కావాలసిన మసాలా : అజినమోటా : 1 చెంచా  సోయాసాస్ : 3 చెంచాలు చిల్లీసాస్ : 2 చెంచాలు  టొమోటాసాస్ : 2 చెంచాలు  వోర్ సెస్టర్ షేర్ సాస్ : 2చెంచాలు  ఉప్పు, నూనె, : సరిపడ పంచదార : 1 చెంచా తెల్ల మిరియాల పొడి : 1 చెంచా క్యాబేజీ సన్నగా కట్ చేసినవి : 1 చెంచా క్యాప్సీకమ్ సన్నని ముక్కలు : 2 కప్పులు ఉల్లికాడలు సన్నగా కట్ చేసినవి : 1 చెంచా నూరుకోవాలసిన ముద్ద : వెల్లుల్లి : 6 రెబ్బలు  మిరప్పొడి : 11/2 చెంచా తయారీ విధానం : మొదట పిండి తయారీ : మైద, సోడా, బేకింగ్ ఫౌడర్, ఉప్పు మొత్తం రెండుసార్లు జల్లించి ఉంచాలి. బేసిన్ లోపోసి నూనె పోసి పిండి వేళ్లతో బాగా కలిపి తగినంత నీరు పోసి ముద్దగా తయారుచేసుకోవాలి నూనె రాసిన పీటమీద బాగా పిండిని మర్ధన చేసి పిసికి తడిగుడ్డలో ఒక అరగంట ఉంచాలి.  మసాలా తయారీ : బాండీలో 4 చెంచాల నూనె వేసి కాగిన తర్వాత నూరినముద్ద, ఉల్లిముక్కలు వేసి వేగిన తర్వాత క్యాప్స్ కమ్, క్యారెట్, క్యాబేజీ ముక్కలు, తురుము వేసి కలిపి చివరగా ఉల్లికాడలు ముక్కలను వేయాలి. పెద్దమంట మీద వేసి అజి-న-మోటా తర్వాత ఉప్పు వేసి కలిపి కూరలు వుడకనివ్వాలి. మిగతా పధార్థాలను వేసి ఉడికి పొడిగా అయిన తర్వాత పొయ్యి మీద నుంచి దింపాలి. రోల్స్ తయారీ విధానము : ఒక రోలు తయారీకి రెండు చిన్న వుండలు తీసికొని గుండ్రంగా పూరీ సైజులో వత్తుకొని మొదట తయారు చేసుకున్న పేస్టుతో రెండు పూరీలను అతికించి (సీలు చేయాలి) మైదా ఉపయోగించి ప్రతీ రోలును పల్చగా, పొడవైన చపాతీలాగా చేయాలి.  ఒక మూల నుంచి 2 చెంచాల మసాలాను రాసి రెండవ పేస్టును చపాతీ అంచులకు మొత్తం రాసి ముందు ప్రక్కలు మూసి ముద్ద కూరిన ప్రక్కనుంచి రెండవ చివరికి చుట్టి సిలిండరులాగా తయారు చేసుకోవాలి. అలా మొత్తం తయారు చేసుకొని పళ్లానికి నూనె రాసి రోల్స్ను విడివిడిగా సర్థి ఇడ్లీల మాదిరి కుక్కర్ లో పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. తరువాత తీసి నూనెలో మీడియం సెగమీద కరకరలాడేలా వేసి టొమోటా లేదా చిల్లీసాస్ తో ఒక్కొక్క ముద్దను నాలుగైదు ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయాలి. పిండిని బాగా కలపకపోతే ఉడికించినప్పుడు మధ్యలో విడిపోతాయి. పార్టీలప్పుడు ముందు రోజే రోల్స్ తయారు చేసుకొని ఆవిరికి ఉడికించి తర్వాత ప్లాస్టిక్ సంచులలో ఒకదానికొకటి అంటుకోకుండా భాగా ఖాళీ ఉంచి అంచులను మూసి ఫ్రీజర్లో ఉంది. వేయించటానికి ఒక అరగంట, గంట ముందు తీసి ఉంచుకొని యధావిధిగా వేసి సర్వ్ చేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: