కావలసిన పదార్థాలు : పెరుగు : అరలీటరు క్యారెట్ : 50గ్రా. బీన్స్ : 50గ్రా. తీపి గుమ్మడికాయ : చిన్నముక్క పచ్చికొబ్బరి : అర చిప్ప పచ్చిమిర్చి : ఆరు జీలకర్ర :  అరటీ.  ఎండుమిర్చి :  3 ఆవాలు :  పావు టీ. కరివేపాకు : ఒక రెమ్మ ఉప్పు : తగినంత నూనె : 3 టీ . బియ్యం : పావు కప్పు పసుపు :  పావు టీ. తయారీ విధానం : బియ్యం కడిగి ఓ పది నిమిషాలు నానబెట్టి మెత్తగా రుబ్బాలి. క్యారెట్లు, బీన్స్‌, గుమ్మడికాయలను ముక్కలుగా కోసి ఉప్పు వేసి ఉడికించాలి. పెరుగును బాగా గిలకొట్టి అందులో పచ్చికొబ్బరి, పచ్చిమిర్చి తురుము, జీలకర్ర, బియ్యంముద్ద వేసి చిక్కగా అయ్యేవరకూ మరిగించాలి. తరవాత అందులోనే ఉడికించి ఉంచిన ముక్కలు వేసి మరికాసేపు మరిగించాలి. ఓ గిన్నెలో నూనె వేసి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు వేసి తాలింపు చేసి పెరుగు మసాలాలో కలిపి, ఉప్పు సరిచూడాలి. అంతే వెజిటబుల్‌ పెరుగు పచ్చడి సిద్ధమైనట్లే..!

మరింత సమాచారం తెలుసుకోండి: