కావలసిన పదార్థాలు:   పాలు - ఒక లీటరు శనగపప్పు - 1 కప్పు కొబ్బరి పాలు - 2 కప్పులు బొంబాయి రవ్వ - 1/4 కప్పు బెల్లం - ఒకటిన్నర కప్పు ఇలాచీలు - 2 నెయ్యి - 1 టేబుల్ స్పూను జీడిపప్పు, బాదం, కిస్‌మిస్ - తగినన్ని  తయారు చేసే పద్ధతి కుక్కర్‌లో శనగపప్పు, రెండు కప్పుల నీరు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచితే పప్పు మెత్తగా ఉడుకుతుంది. విడిగా బెల్లంలో కొద్దిగా నీరుపోసి కరిగించి పెట్టుకోవాలి. ఉడికించిన శనగపప్పులో ముందుగా బొంబాయి రవ్వ(నీళ్లలో కలుపుకుని), తర్వాత బెల్లం పాకం, చివర్న కొబ్బరిపాలు పోసి కాసేపు ఉడకనివ్వాలి. దించే ముందు ఇలాచీ పొడి, నేతిలో వేయించిన డ్రైఫ్రూట్స్ వేయాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: