కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం : మూడు కప్పులు కాలీఫ్లవర్ : ఒకటి అల్లం వెల్లుల్లి పేస్ట్ : చెంచెడు ఆలుగడ్డలు : మూడు పచ్చిమిర్చి : నాలుగు నూనె : సరిపడా పసుపు : చిటికెడు ఉల్లిపాయలు : మూడు టమోటాలు : మూడు ఉప్పు : రుచికి తగినంత తయారు చేసే పద్ధతి: ముందుగా కాలీఫ్లవర్‌ను ఉడికించాలి. ఆలుగడ్డలను చిన్న చిన్న ముక్కలు చేసి నూనెలో వేయించాలి.


మూకుడులో నూనె వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద, తరిగిన టమోటాలను కూడా వేసి వేయించాలి. పసుపు, కారం, మసాలా, పచ్చి మిర్చి ముక్కలు కూడా వేయించాలి. తర్వాత ఉప్పు వేసి చివరగా ఉడికించిన కాలీఫ్లవర్ వేసి కలిపి ఈ మిశ్రమాన్ని ఉడికించిన రైస్‌లో కలపాలి. చివరగా ఆలుగడ్డ ముక్కలు కలుపుకోవాలి. కొత్తిమీర సన్నగా తరిగి చల్లుకొని వడ్డించుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: