వండిన అన్నం: 3 కప్పులు, తెల్ల నువ్వులు (వేయించినవి):  2 టేబుల్‌స్పూన్లు, నల్ల నువ్వులు(వేయించినవి): 2 టేబుల్‌ స్పూన్లు, కరివేపాకు: అరకప్పు, ఉల్లిపాయలు (మీడియం సైజువి): రెండు, పచ్చిమిర్చి: నాలుగు, నూనె: రెండు టేబుల్‌స్పూన్లు, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, ఇంగువ: పావుటీస్పూను, ఆవాలు: అరటీస్పూను, సెనగపప్పు: టీస్పూను, పసుపు: పావుటీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, నిమ్మరసం: 2 టీస్పూన్లు, మిరియాలు: అరటీస్పూను.

తయారు చేయు విధానం :

Image result for నువ్వుల అన్నం

ముందుగా బాణలిని పొయ్యి మీద పెట్టి నూనె లేకుండా నువ్వుల్ని వేయించి తీసి పెట్టుకోవాలి. అదే బాణలిలో మరో చెంచా నూనె వేడిచేసి ఎండుమిర్చీ, సెనగపప్పూ, ఇంగువ వేయించి దింపేయాలి. ఈ తాలింపులో తగినంత ఉప్పూ, వేయించిన నువ్వులూ కలిపి మరీ మెత్తగా కాకుండా పొడిలా చేసుకుని తీసుకోవాలి. బాణలిలో మిగిలిన నూనె వేడిచేసి అన్నం, చేసుకున్న నువ్వులపొడీ వేసుకుని రెండింటినీ బాగా కలిపితే చాలు. ఉప్పు,   నిమ్మరసం, కచ్చాపచ్చాగా నూరిన మిరియాలు వేసి కలపాలి. చివరగా మిగిలిన నెయ్యి వేసి కలిపి వేడిగా వడ్డించాలి. కలిపితే చాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: