కావలసిన పదార్థాలు: బోడ కాకరకాయలు: పావు కిలో ఉల్లిగడ్డ: ఒకటి (చిన్నది) అల్లం వెల్లుల్లి ముద్ద: రెండు చెంచెలు పసుపు: చిటికెడు కారప్పొడి: రెండు చెంచెలు చక్కెర :చెంచెడు నువ్వుల పొడి: రెండు చెంచెలు ధనియాల పొడి: రెండు చెంచెలు పాలు: చిన్న గరిటెడు మంచి నూనె : సరిపడా పోపు గింజలు : సరిపడా కొత్తిమీర కట్ట: ఒకటి ఉప్పు: రుచికి తగినంత తయారు చేసే పద్ధతి: బోడ కాకర కాయల్ని చక్రాల్లా తరుగుకోవాలి.

స్టౌ మీద మూకుడు పెట్టి ఒక గరిటెడు నూనె వేయాలి. అది కాగిన తర్వాత అందులో పోపు గింజలు ఉల్లిపాయ ముక్కలు, పసుపు, అల్లం ముద్ద వేసి, బాగా కలపాలి. తర్వాత కాకరకాయ ముక్కలు వేసి పాలు పోసి మూత పెట్టాలి.

కొంచెం మగ్గిన తర్వాత కారం, ఉప్పు వేసి కొద్దిసేపు ఉంచి, దానిలో నువ్వుల పొడి, ధనియాల పొడి, చక్కెర వేసుకుని బాగా డీప్ ఫ్రై చేయాలి. చివరలో కొత్తిమీర వేసి దించుకోవాలి. అంతే! వేడి వేడి అన్నంలోకి బోడ కాకర కాయ కూర ఎంతో రుచిగా ఉంటుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: