భారత దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎంతో సంబరంగా ఆనందంగా జరుపుకునే పండుగ దీపావళి.  దీపావళి అంటేనే కాంతుల మయం..ఎక్కడ చూసినా దీపాలతో అలంకరణ కరినిస్తుంది...బాణా సంచా పేలుస్తూ ఆనందంగా గడుపుతారు.  అయితే దీపావళి వేడుకల్లో పిండి వంటకాలు కూడా ప్రత్యేకం.  తమకు ఇష్టమైన తీపి పదార్థాలు చేసుకొని సంతోషంగా తింటారు. దీపావళి పండుగ స్పెషల్ గా వెరైటీగా డ్రైఫ్రూట్స్ లడ్డు ఎలా చేస్తారో చూద్దామా..


కావాల్సిన పదార్ధాలు :
జీడిపప్పు - ఒక కప్పు
బాదంపప్పు- ఒక కప్పు
పిస్తాపప్పు - ఒక కప్పు
ఖర్జూరాలు - 250 గ్రాములు
గసగసాలు - 50 గ్రాములు
నెయ్యి - 100 గ్రాములు
పంచదార - 100 గ్రాములు
ఏలకులు - 4


తయారీ విధానం :
 - లడ్డూలు కేవలం స్వీట్లగానే కాకుండా డ్రైఫ్రూట్ లడ్డూలు మంచి పోషక విలువలను కలిగి ఉంటాయి. 
- ఇవి తయారుచేయాలంటే ముందుగా మంచి క్వాలిటీ జీడిపప్పు , బాదంపప్పు, పిస్తాపప్పులను తీసుకోవాలి. 
- ఇలా తీసుకున్న జీడిపప్పు , బాదంపప్పు, పిస్తాపప్పులను చిన్న ముక్కలుగా చేసుకువాలి. 
- మరోపక్క ఒక బాణలిలో నెయ్యి వేడి చేసి ఈ పప్పులను దోరగా వేయించుకోవాలి. వాటిని పక్కన పెట్టుకొని గసగసాల్ని కూడా  దోరగా వేయించుకోవాలి. 
- ఇప్పుడు ఒక గిన్నెలో ఒక పావు లీటరు నీళ్ళు తీసుకుని పొయ్యి మీద పెట్టి  మరిగించాలి. నీళ్ళు మరుగుతున్నప్పుడు 100 గ్రాముల పంచదార కలిపి నీళ్ళ పాకం పట్టాలి. 
- ఇప్పుడు ఆ పాకంలో పావుకిలో ఖర్జూరాలు  కలిపి అవి మెత్తగా అయ్యేదాకా ఉంచాలి.  తర్వాత యాలకుల పొడి సువాసన కోసం కలుపుకోవాలి. 
- ఈ మిశ్రమంలో ఇంతకు ముందు వేయించి పెట్టుకున్న పప్పుల్ని, గసగసాల్ని కలుపుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని  చిన్నచిన్న ఉండలుగా చుట్టుకోవాలి. అంతే డ్రై ఫ్రూట్స్ లడ్డూలు తినడానికి రెడీ.


మరింత సమాచారం తెలుసుకోండి: