తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ అంటే ఎంతో సంబరాలతో జరుపుకుంటారు.  ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతి పండుగకు విదేశాల్లో ఉన్న వారు సైతం వారం ముందు తమ ఊళ్లకు చేరుకుంటారు.  వారం రోజుల పాటు ఎంతో ఆనందంగా ఈ పండుగ జరుపుకుంటారు.  కోడి పందాలు, ఎడ్ల పందాలు, గాలిపటాల జోరు..ఇంటి ముందు గొబ్బెమ్మలు, రంగు రంగు రంగవళ్లీలతో గ్రామీణ వాతావరం ఎంతో అహ్లాదంగా ఉంటుంది. 


ఏడాదిపాటు ఎక్కడెక్కడో ఉన్న రక్త సంబంధీకులు, ఆత్మీయులు, స్నేహితులను ఒక చోట చేర్చి ఆప్యాయతలను పంచుకునేలా చేసే పండుగ సంక్రాంతి. సంక్రాంతి పండుగ అంటేనే రకరకాల వంటకాలు నోరూరిస్తాయి.  ముఖ్యంగా సంక్రాంతికి అరిసెలు, చెక్కలు, సకినాలు, లడ్డూ బూంది, కొత్త బియ్యంతో కట్టె పొంగలి, చక్రాలు చేస్తుంటారు. వీటితోపాటు పలు రకాల వంటకాలను తయారు చేస్తారు. తయారు చేసిన వంటకాలను పేదలకు పంచుతారు. సంక్రాంతి స్పెషల్ గా కట్టె పొంగలి గురించి తెలుసుకుందాం. 

కావలసిన పదార్థాలు:

బియ్యం‌: 1/2kg

పెసరపప్పు: 1/2kg

మిరియాలు: 2tsp

ఎండుమిర్చి: 4-6

ఆవాలు: 2tsp

నెయ్యి : 4tsp

జీడిపప్పు: 8-10

ఉప్పు : రుచికి తగినంత

కరివేపాకు : 2 రెబ్బలు

తయారు చేయు విధానం: 1. ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. 2. తరువాత బియ్యం పప్పు కలిపి ఉడకబెట్టాలి. 3. బాగా మెత్తగా ఉడికిన తర్వాత నెయ్యిలో మిరియాలు, ఎండుమిర్చి, ఆవాలు, జీడిపప్పు, కరివేపాకు వేసి తాలింపు పెట్టి ఈ ఉడకబెట్టిన అన్నం, పప్పును అందులో కలపాలి. 4. తినేటప్పుడు పైన కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే చాలా బావుంటుంది. దీనికి కొబ్బరి వేయించిన శనగపప్పుతో చట్నీ తయారు చేసుకొని అందులో తింటే ఆ మజానే వేరు. 

మరింత సమాచారం తెలుసుకోండి: