దేశంలో గత నెల 24 నుంచి కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే.  అయితే కరోనా మాత్రం రోజు రోజుకీ విస్తరిస్తూనే ఉంది. దాంతో ఇప్పుడు కరోనా కట్టడి చేయడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమదైన తమ అధికారులు, మంత్రి వర్గాలతో చర్చలు జరుపుతో పరిస్థితులను సమీక్షిస్తున్నారు.  తాజాగా  తెలంగాణలో కరోనా వైరస్ విస్తరిస్తుండడం, కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. 

 

రేపు తెలంగాణ కెబినెట్ మీటింగ్ ఉన్న విషయం తెలిసిందే.  అయితే ఇప్పటి వరకు కరోనా కేసులు ఎన్ని నమోదు అయ్యాయి.. డిశ్చార్.. మరణాల పై పూర్తి సమీక్ష నిర్వహించి భవిష్యత్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్న విషయం పై చర్చలు జరిపేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం. ఈ సమీక్షకు హాజరు కావాల్సిందిగా వివిధ విభాగాల అధికారులకు ఇప్పటికే సమాచారం వెళ్లింది. కరోనా కట్టడికి తీసుకునే చర్యలతోపాటు, రేపు కేబినెట్ సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, 20వ తేదీ తర్వాత లాక్ డౌన్ కు సడలింపు ఇవ్వాలన్న అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది.

 

మొన్నటి వరకు 20 వరకు పరిస్థితులు మారే అవకాశం ఉందని భావించారు.. కానీ కరోనా కేసులు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి.  దాంతో 20 తర్వాత ఏం చేయాలన్న విషయాలపై కేబినెట్ మీటింగ్ లో చర్చించే అవకాశం ఉందని అంటున్నారు. రేపు కేబినెట్ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ సమీక్షా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle


Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: