తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకు చాప‌కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ముందు నుంచి ఈ విష‌యంలో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయినా క‌రోనా మాత్రం విజృంభిస్తూనే ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క‌ల‌ను బ‌ట్టి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా న‌మోదు అవుతోన్న కేసుల్లో 80 శాతం గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోనే ఉన్నాయి. ఇక ఆదిలాబాద్‌, నిజామాబాద్ జిల్లాల్లోనూ ఈ కేసులు ఎక్కువ‌గానే ఉన్నాయి. 

 

ఆదివారం కేబినెట్ భేటీ త‌ర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ‌లో ఉన్న కంటోన్మెంట్ జోన్ల‌లో క‌ఠిన‌మైన నిబంధ‌న‌లే అమ‌లు అవుతాయ‌ని.. ప్ర‌జ‌లు అంద‌రూ పండుగ‌లు, ప్రార్థ‌న‌లు ఇళ్ల‌లోనే చేసుకోవాల‌న్నారు. ఏ మ‌తానికి సామూహిక ప్రార్థ‌న‌లకు ప‌ర్మిష‌న్లు ఇవ్వ‌మ‌న్నారు.


ఈ విష‌యంలో తాము ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజీ ప‌డ‌మ‌ని కేసీఆర్ చెప్పారు. మే 5వ తేదీన మ‌ళ్లీ కేబినెట్ భేటీ అయ్యి 7వ తేదీ త‌ర్వాత లాక్‌డౌన్ కంటిన్యూ చేయాలా ?  వ‌ద్దా ? అన్న‌ది నిర్ణ‌యం తీసుకుంటామ‌ని ఆయ‌న తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: