జియో రాక తో టెలిఫోన్  రంగంలో వ్హాల్ మార్పులుచోటు చేసుకున్నాయి ఎయిర్టెల్  ,వోడాఫోన్  ఐడియా  లాంటి సంస్థలు నష్టాల పలు కావాల్సి వస్తుంది . దీని కారణంగానే ఐడియా  వోడాఫోన్  లు కలిసాయి .కానీ సంక్షోభంతో వోడాఫోన్ ఇండియా నష్టాల్లో కూరుకుపోయింది.


కొన్నిరోజులుగా మీడియాలో వోడాఫోన్ ఇండియా.. దేశం వదిలిపోతుందనే వార్తలు  పుకార్లు హల్ చల్ చేస్తున్నాయి. వోడాఫోన్ అత్యంత సంకటపు స్థితిలో ఉందని, త్వరలో మూసివేస్తున్నారంటూ నివేదికలు వెల్లడించాయి. వీటిపై స్పందించిన వోడాఫోన్ గ్రూపు ఇండియా సీఈఓ నిక్ రీడ్ భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారు. తమ కంపెనీ ఇండియా వదిలి ఎక్కడికి వెళ్లిపోవడం లేదని ఆయన పునరుద్ఘాటించారు.


వోడాఫోన్ ఇండియాకు సంబంధించిన తన వ్యాఖ్యలను మీడియాలో తప్పుగా చూపించారని  సీఈఓ నిక్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన  భారత ప్రధాని నరేంద్ర మోడీ, టెలికం శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ కు లేఖ రాశారు. కొన్ని మీడియా నివేదికల కారణంగానే తన వ్యాఖ్యలను ఇలా తప్పుగా  వక్రీకరించారని, ఈ విషయంలో తమను క్షమించాలని లేఖలో తెలిపారు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తమ కంపెనీకి సాయం చేసేందుకు ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఉందని, దీనికి సంబంధించి ప్రభుత్వంతో వోడాఫోన్ సంప్రదింపులు కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.


‘వోడాఫోన్.. భారత్‌లో సుదీర్ఘ చరిత్రను సరైన పరిస్థితుల్లో కొనసాగించాలని కోరుకుంటున్నాను. దేశం సామర్థ్యాన్ని, దాని టెలికాం రంగం, దేశ పౌరులకు రూపాంతరం చెందగల సామర్థ్యం ఉందని బలంగా విశ్వసిస్తున్నాం. డిజిటల్ ఇండియా విజన్ తో మేం సన్నిహితంగా ఉన్నాం’ అని అన్నారు. మొబైల్ స్పెక్ట్రం ఫీజు చెల్లించాలన్న డిమాండ్లపై వొడాఫోన్ ఐడియా మూసివేయవచ్చని బ్లూమ్‌బెర్గ్ నివేదించిన ఒక రోజు తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: