ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం కలిగించే విధంగా మోదీ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ తన నిర్ణయం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు ఎంతో కాలం నుండి కోరుకుంటున్న డిమాండ్ ను నెరవేర్చారు. కేంద్రం తాజా బడ్జెట్ సమావేశాల సమయంలో పెన్షన్ రూల్స్ ను మార్చి ఉద్యోగులకు రెండు ఆప్షన్లు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 
 
కేంద్రం ఉద్యోగులకు ఎన్‌పీఎస్ నుండి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ లోకి మారేందుకు మరియు ఈ ఆప్షన్ వద్దనుకున్న ఉద్యోగులు ఎన్‌పీఎస్ లోనే కొనసాగేలా ప్రభుత్వం నిబంధనలను అమలులోకి తెచ్చింది. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం అందరికీ వర్తించదని కేవలం 2004 సంవత్సరం లోపు ఉద్యోగంలో చేరిన వారికి మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 2004 జనవరి 1 తరువాత ఉద్యోగం మారిన వారికి పెన్షన్ మార్చుకునే అవకాశం ఉండదు. 
 
2020 మే 31వ తేదీలోపు అర్హత ఉన్న ఉద్యోగులు ధరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మే 31వ తేదీలోపు ధరఖాస్తు చేసుకోకపోతే అర్హత ఉన్నా వారు ఎన్‌పీఎస్ లోనే కొనసాగుతారు. 2004 జనవరి 1వ తేదీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ లో చేరడానికి కటాఫ్ గా ఉంది. ఈ డేట్ కు ముందు ఉద్యోగం లభించిన వారు పాత పెన్షన్ స్కీమ్, లేదా ఎన్‌పీఎస్ లో చేరే అవకాశం ఉంటుంది. అర్హత ఉన్న ఉద్యోగులు ఓల్డ్ పెన్షన్ ను ఎంచుకుంటే మాత్రం ఎన్‌పీఎస్ అకౌంట్ క్లోజ్ కానుంది. 2020 సెప్టెంబర్ నెలలో అర్హత ఉన్న ఉద్యోగుల వివరాలతో కేంద్రం నోటిఫికేషన్ ను జారీ చేయనుండగా 2020 నవంబర్ నెల నుండి అర్హత కలిగిన ఎన్‌పీఎస్ అకౌంట్లు క్లోజ్ కానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: