శృంగారం అనేది స్త్రీ, పురుషుల మధ్య అన్యోన్యతను పటిష్ఠం చేస్తుంది ఆనందాన్ని పెంచు తుంది ఆరోగ్యాన్ని పంచుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి అద్భుత మైన మార్గం ఇది. ‘ఫోర్‌ప్లే’ నుంచి రతిక్రీడ వరకు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తే జీవితంలో మరిచి పోలేని మధురాను భూతులు మిగిలిపోతాయి. పడకగదిలోకి వెళ్లింది మొదలు సంభోగం ప్రారంభమయ్యే వరకు ప్రతిక్షణాన్ని ఎంతో ఆత్రుతతో, ఉద్వేగంతో, ఉత్సాహంతో అనుభవిస్తారు. అయితే, కొందరు మహిళలు సంభోగ సమయంలో ఏడుస్తారు.

Related image

ఆ ప్రక్రియ ఆనందాన్ని కలిగించినా ఏడుపు ఆపుకోలేరు. అలా ఎందుకు జరుగుతుంది? దానికి కారణాలేంటి? అని ఒక వైద్య బృందం పరిశోధనలు చేపట్టగా, ఇలా ఏడవడం సాధారణమేనని తేలింది. ‘మనం ఊహించిన దానికన్నా ఇది అతి సాధారణమే’ అని డా. ఇమ్లీ మోర్స్ - అనే వైద్యురాలు తెలిపారు. దీన్ని ‘క్రైగాజం’ అని అంటా రని ఆమె వెల్లడించారు.

Image result for crygasm

ఎందుకు ఇలా అవుతోందంటే:

1. అనుకున్న దానికంటే శృంగారం ఎక్కువ ఆనందాన్ని కలిగించడం, అనుభవాన్ని మించిన అనుభూతి తదాత్మ్యత ఎక్కువగా ఉండటం, అధికమైన ప్రేమతో ఇష్టపడి ఒకరి కౌగిట్లో మరొకరు బందీ అయిపోవడం మూలంగా, ఆక్సిటోసిన్ అత్యాతురత వల్ల ఇలా కలుగుతుందని నిపుణులు తేల్చారు.

2. గతంలో ఎప్పుడైనా ఎదురైన ప్రతికూల శృంగార అనుభవవం మెదడులో, శరీరంలో ఆ జ్ఞాపకాలు రగిలి, కూడా రోదించే అవకాశాలున్నాయట.

3. భాగస్వామిపట్ల కోపం, బెంగ ఉన్నా శృంగార సమయంలో తృప్తితో కన్నీళ్లు వస్తాయట.

4. ఇక, అన్నింటి కంటే ముఖ్యంగా శారీరక హింస వల్ల ఏడుస్తారని, సంభోగ సమయంలో యోని భాగం పొడిబారినట్లు ఉన్నా, మంటగా ఉన్నా ఇలా జరుగుతుందని వైధ్యులు పేర్కొన్నారు.

ఒకటి, రెండు సందర్భాల్లో ఏడిస్తే పెద్ద సమస్యేమీ కాదని, కానీ, రతిక్రీడ జరిపిన ప్రతీ సారి ఏడిస్తే ఆ మహిళ వ్యక్ర్తిగత భాగోద్వేగానికి సంబంధించినదై ఉంటుందని, దాన్ని సున్నితంగా సానుకూలత సాధించాలని తెలిపారు.

అదే, ఇష్టమైన ఏడుపైతే భాగస్వామికి ముందే చెప్పాలని, బాధతోనో, నొప్పితోనో ఏడవటం లేదని అర్థమయ్యేలా చెబితేనే మంచిదని, ఇలాంటప్పుడు ఎలాంటి మొహమాటానికి పోకూడదని సూచిస్తున్నారు.

 Image result for crygasm

మరింత సమాచారం తెలుసుకోండి: