టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని ఇబ్బందులు పెడుతున్న సమస్యల్లో ఒకటి క్యాస్టింగ్ కౌచ్.  శ్రీ రెడ్డి ఈ సమస్యపై పోరాటం చేసింది.  అర్ధనగ్నంగా ఫిలిం ఛాంబర్ వద్ద కూర్చోవడంతో.. ఇది మరింత పెద్దదైంది. ఆ తరువాత పలువురు సినిమా ఇండస్ట్రీకి చెందిన మహిళలు దీనిపై స్పందించిన సంగతి తెలిసిందే.  

క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఇప్పటికి ఉందని, దానివలన మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని వాళ్ళ బాధను వెళ్లగక్కుతున్నారు.  అయితే, కొంతమంది బయటకు వచ్చినా.. కొందరు మాత్రం బయటకు రావడం లేదు.  ఏదోలా సర్దుకుపోతున్నారు.  

దీనిపై ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి సంస్థ చైర్మన్, ఎమ్మెల్యే రోజా స్పందించింది.  తనకు క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎదురుకాలేదని, తన మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు చాలా స్మూత్ గా జరిగిపోయిందని చెప్పింది.  సినిమా రంగంలోకి రావాలనే టార్గెట్ పెట్టుకొని ఎలాగైనా రావాలి అనుకుంటున్న మహిళలు లొంగిపోతున్నరని వ్యాఖ్యానించారు.  

ఇండస్ట్రీలోకి రావాలని, ఇండస్ట్రీలో నిలబడాలని చెప్పి ప్రయత్నం చేసి, లొంగిపోయి తరువాత వాళ్ళే ఇలాంటి అభియోగాలు చేయడం మంచిది కాదని రోజా అంటోంది.  సినిమా వంటి ట్విస్ట్ ల తరువాత రోజాకు జగన్ ప్రభుత్వంలో పోస్ట్ దొరికింది.  తనకు ఏ పదవి వద్దని చెప్పినా, జగన్ తనకు ఈ పదవి ఇచ్చారని అంటోంది రోజా. 


మరింత సమాచారం తెలుసుకోండి: