‘బిగ్ బాస్ 3’ షో గురించి ఎన్నో వివాదాలు కోర్టు కేసులు జాతీయ మహిళా కమీషన్ కు ఫిర్యాదులు అందినా ‘బిగ్ బాస్ 3’ ప్రసారాన్ని అడ్డుకోలేకపోయాయి. ఈ వివాదాల పై ఇప్పటి వరకు ఎక్కడా మీడియా ఎదుట మాట్లాడని నాగార్జున తొలిసారి మీడియా ముందు మాట్లాడవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి. 

‘బిగ్ బాస్’ షోను ప్రజలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారో తనకు అర్ధం కావడం లేదనీ ప్రపంచ వ్యాప్తంగా 15 దేశాలలో ఈషో వివిధ ప్రపంచ భాషలలో ప్రసారం అయితే హిందీలో ఈషో 12వ సీజన్ ప్రసారం అయితే ఆవిషయాలు అన్నీ పక్కకు పెట్టి కేవలం తెలుగు ‘బిగ్ బాస్ 3’ ఎందుకు విమర్శిస్తున్నారో తనకు అర్ధంకాని విషయంగా మారింది అంటూ నాగ్ కామెంట్ చేసాడు. తాను గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక కుర్చీలో బిగుసుకు పోయి కూర్చునే అవసరం ఏర్పడిందని అయితే ప్రస్తుతం తనకు ‘బిగ్ బాస్’ షోలో స్వేచ్చగా తిరుగుతూ మాట్లాడే అవకాశం లభించింది అని కామెంట్ చేసాడు నాగార్జున.  

పుకార్లు కాంట్రవర్సీలు అనేవి లేకుండా ఏకార్యక్రమాలు ఉండవని అయితే ‘బిగ్ బాస్ 3’ వ్యవహారం కోర్టు పరిధిలో ఉండటంతో తాను ఇంతకుమించి అసలు వాస్తవాలు చెప్పలేను అంటూ కామెంట్ చేసాడు. అంతేకాదు ఎవరు తప్పు చేసినా శిక్ష నుండి తప్పించుకోలేరని అదేవిధంగా ‘బిగ్ బాస్ 3’ షో విషయంలో ఎవరైనా తప్పు చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది అంటూ నాగ్ అభిప్రాయ పడుతున్నాడు. 

ఇక షో పార్టిసిపెంట్స్ ఎంపిక విషయం చివరి నిముషం వరకు తనకు తెలియదు అంటూ ఈషో ప్రారంభానికి కొద్ది సమయం ముందు తనకు ఈషో  హౌస్ మేట్స్ ను పరిచయం చేసిన విషయాన్ని బయటపెట్టాడు. నాగ్ చాల తెలివిగా ‘బిగ్ బాస్’ వివాదాలపై స్పందించడంతో అతడిని ఇరుకున పెడదామని ప్రయత్నించిన మీడియా ప్రతినిధుల ప్రయత్నాలు అన్నీ ఫెయిల్ అవ్వడం ‘మన్మధుడు 2’ ట్రైలర్ లాంచ్ ఫంక్షన్ లో స్పష్టంగా కనిపించింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: