మంచి విజయం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న టాలీవుడ్ హీరో....  చాక్లెట్ బాయ్ రామ్ కాస్త.. ఊరమాస్ గెటప్లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్నారు. ఓవైపు ఇస్మార్ట్ వంద రోజుల పండగను ఫ్యాన్స్ అంతా సెలబ్రేట్ చేసుకుంటున్న వేళ.. రామ్ కొత్త సినిమా ప్రకటన కూడా రావడంతో అభిమానుల ఆనందం డబుల్ అయింది. 


 ఇస్మార్ట్ సినిమాతో ఇండస్ట్రీలో హిట్ కొట్టిన హీరో రామ్.. మరోసారి మాస్ పాత్రలో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు.రామ్ 18 వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు రెడ్ అనే టైటిల్ ను పెట్టారు. ఈ  చిత్రం టైటిల్, ఫస్ట్లుక్ను సోమవారం అభిమానులతో పంచుకున్నాడు.
 'రెడ్' అనే వినూత్నమైన పేరు పెట్టారు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదే డైరక్టర్తో ఇంతకు ముందు 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' చిత్రాల్లో నటించాడు రామ్.


ఇస్మార్ట్ శంకర్ కు అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు సూపర్ హిట్ సాంగ్స్ అందించిన మణిశర్మ, రామ్ కొత్త సినిమాకు కూడా వర్క్ చేయబోతున్నాడు.త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.  మరి ఈ చిత్రంతో ఇంకెలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
 సాలిడ్ గా మంచి విజయం సాధించి రామ్ కు చాలాకాలం అయ్యింది. రామ్ కోరికను పూరి ఇస్మార్ట్ శంకర్ తో సినిమా తీర్చారు. ఈ సినిమా తరువాత రామ్సినిమా చేయబోతున్నారు అనే ఆసక్తి అందరిలో కలిగింది.

అయితే, తమిళంలో సూపర్ హిట్టైన 'తడం' సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. తిరుమల కిషోర్ దర్శకత్వంలో స్రవంతి మూవీస్ పతాకంపై  రవికిశోర్ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతోంది.రామ్ మేకప్ లేకుండా బ్లాక్ కలర్లో గడ్డం పెంచి ఉన్నాడు.  టైటిల్ రెడ్.. కలర్ బ్లాక్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి.  నవంబర్ 16 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ షురూ చేస్తారు. హీరోయిన్ ను త్వరలోనే ఎనౌన్స్ చేస్తారు


మరింత సమాచారం తెలుసుకోండి: