మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో కూడా సినిమాలు చేశారు. తెలుగులో అప్రతిహత స్టార్ డమ్ సాధించాక ఆయన బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయాలనే ఉద్దేశంతో అక్కడ అడుగు పెట్టారు. హిందీలో చిరంజీవి మూడు సినిమాలు చేశారు. ప్రతిబంద్, ఆజ్ కా గూండారాజ్, జెంటిల్ మెన్ సినిమాలు చేశారు. మూడు సినిమాలు కూడా రీమేక్ గా చేసారు. ఇందులో జెంటిల్ మెన్ సినిమా విడుదలై నేటికి 25 ఏళ్లు పూర్తయ్యాయి.

 


1994 నవంబర్ 18న విడుదలైన ది జెంటిల్ మెన్ సినిమా తమిళ్ లో శంకర్ దర్శకత్వంలో అర్జున్ హీరోగా వచ్చిన జెంటిల్ మెన్ సినిమాకు రీమేక్. హిందీలో ఈ సినిమాకు మహేశ్ భట్ దర్శకత్వం వహించారు. జూహి చావ్లా హీరోయిన్ గా నటించింది. మెయిన్ విలన్ గా పరేశ్ రావల్ నటించారు. చిరంజీవి నటించిన మొదటి రెండు హిందీ సినిమాలు సూపర్ హిట్ కాగా ది జెంటిల్ మెన్ సినిమా హిట్ సినిమాగా నిలబడింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించారు. తొలి రెండు సినిమాలకు తెలుగు దర్శకుడు రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించగా ది జెంటిల్ మెన్ కు హిందీ దర్శకుడు మహేశ్ భట్ దర్శకత్వం వహించారు.

 


తమిళ సినిమాకు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించగా హిందీ వెర్షన్ కు అను మాలిక్ సంగీతం అందించారు. ఒరిజినల్ వెర్షన్ లోని మూడు పాటలను అవే ట్యూన్స్ ఉపయోగించారు. చికుబుకు రైలే.. పాటలో తమిళ్ లో ప్రభుదావా నటించగా హిందీలో చిరంజీవే నటించారు. ఈ సినిమా హిందీలో చిరంజీవి నటించిన ఆఖరి చిత్రం. తర్వాత 25 ఏళ్లకు రీసెంట్ గా సైరా..తో మళ్లీ బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: