ప్రశ్నించడానికే జనసేనను స్థాపించిన పవన్ కల్యాణ్ పలు ప్రశ్నలు సంధిస్తున్నాడు. జెరూసలెం, హాజ్ వెళ్లే యాత్రికుల కోసం ఇచ్చే సబ్సీడీలు, హిందే దేవాలయాలు కట్టే పన్నులపై ఆయన ట్వీట్ చేశారు. దీనిపై హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలుగులో అనువాదం చేసి పోస్ట్ చేశారు.

 

 

‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హజ్ యాత్రికులకు, జెరూసలెం యాత్రికులకు సబ్సిడీలు పెంచడం పట్ల మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో సహా అన్ని సెక్యులర్ ప్రభుత్వాలకి మా నుంచి కొన్ని ప్రశ్నలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు దేవాలయాల ఆదాయం నుంచి ఏటా 23.5 శాతాన్ని వివిధ పన్నుల రూపంలో వసూలు చేస్తున్నాయి. ఎండోమెంట్ అడ్మినిస్ట్రేషన్ టాక్స్ రూపంలో 15 శాతం, ఆడిట్ ఫీజు రూపంలో 2 శాతం, కామన్ గుడ్ ఫండ్ నిమిత్తం మరో 2 శాతం.. ఇవే కాకుండా అర్చక వెల్ఫేర్ ఫండ్, ఇతర పన్నుల రూపంలో ఆలయాల ఆదాయంలో నాలుగో వంతుని ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయి. ఏ ఒక్క చర్చి కానీ, మసీదు కానీ ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించడం లేదు. కేవలం దేవాలయాలు మాత్రమే ఎందుకు పన్నులు చెల్లించాల్సి వస్తోంది?

 

 

భారత రాజ్యాంగంలోని 27వ అధికరణం ప్రకారం ధార్మిక సంస్థల నుంచి ప్రభుత్వాలు ఎలాంటి పన్నులూ వసూలు చేయకూడదు. మరి.. దేవాలయాల నుంచి మాత్రమే పన్నులు ఎందుకు వసూలు చేస్తున్నారు? ఈ చిన్న ప్రశ్నకు జవాబివ్వండి చాలు’ అంటూ పోస్ట్ చేశారు. ఇటివల ఈ వాదనలు ఎక్కువయ్యాయి. ప్రభుత్వాల నిర్ణయంపై బీజేపీ నాయకులు కూడా పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మరి పవన్ చేసిన ట్వీట్ పై రాజకీయంగా ఎటువంటి స్పందన వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: