పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే ఎటువంటి హడావిడి ఉంటుందో మొన్నటి వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ కే తెలిసిపోయింది. పవన్ స్టామినా ఏంటో.. ఫ్యాన్స్ బలగమెంతో.. పవనిజం పవరేంటో మరోసారి టాలీవుడ్ కి రుచి చూపించారు. వకీల్ సాబ్ తో పాటు సమాంతరంగా క్రిష్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు పవన్. ఆ సినిమాను కూడా ఈ ఏడాదే విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాపై ఓ ఆసక్తికరమైన న్యూస్ ఫిలింనగర్ లో రౌండ్ అవుతోంది.

 

 

సినిమా షూటింగ్ కూడా శరవేగంగాను జరుగుతోంది. పవన్ రాజకీయ కమిట్ మెంట్లు కొన్ని నాదెండ్ల మనోహర్ చూస్తున్నారు. అందుకే పవన్ వేగంగా షూటింగ్ చేయగలుగుతున్నాడని అంటున్నారు. ఇదే వేగంతో సినిమా చేసి ఫస్ట్ లుక్ ను పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాను కూడా దీపావళి సందర్భంగా విడుదల చేయాలనేది దర్శక, నిర్మాతల ప్లాన్ గా తెలుస్తోంది. నవంబర్ 13న విడుదల చేసేందుకు అనుగుణంగా షూటింగ్ చేస్తున్నారని తెలుస్తోంది. భారీ బడ్జెట్ కావడంతో ఇతర సినిమాల నుంచి పోటీ లేని సమయంలో విడుదల చేయాలని భావిస్తున్నారట. ఇందులో నిజమెంతుంతో అఫిషియల్ గా న్యూస్ బయటకు రావాల్సిందే.

 

 

సినిమా ధియేటర్లలోకి వచ్చే సమయంలో ఈ హంగామా ఏ లెవల్ లో ఉంటుందో అంచాలు వేసుకోవాల్సిందే. లాయర్ గా నటిస్తున్న సినిమాకే ఇంత హడావిడి చేసిన పవన్ ఫ్యాన్స్ క్రిష్ తో చేసే సినిమాకు ఇంకెంత హడావిడి చేస్తారో అని ఇప్పటి నుంచే లెక్కలు వేస్తున్నారు సినీ పండితులు. పవన్-క్రిష్ కాంబోలో మొదటి సినిమా కాగా.. పవన్-ఏఎం రత్నం కాంబినేషన్లో గతంలో ఖుషి, బంగారం సినిమాలు వచ్చాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: