పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ ఏస్థాయిలో ఉంటుందో మొన్నటి వకీల్ సాబ్ ఫస్ట్ లుక్, నిన్నటి ఫస్ట్ సాంగ్ రిలీజ్ లే చెప్పేశాయి. పవన్ రాజకీయాల్లో ఉండి రెండేళ్లు సినిమాలు చేయకపోయినా ఆయన క్రేజ్ అదే స్థాయిలో ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్న పవన్ తన వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను దాదాపు పూర్తి చేసినట్టు సమాచారం. ఈ సినిమాను మే 15న విడుదల చేయాలని దిల్ రాజు, బోనీ కపూర్ ప్లాన్ చేస్తున్నారు. అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

 

 

దీంతో పాటు పవన్ సైన్ చేసిన క్రిష్ దర్శకత్వంలోని మూవీకి సంబంధించి కూడా ఓ లేటెస్ట్ అప్డేడ్ అందుతోంది. ఈ సినిమా షూటింగ్ లో కూడా పవన్ పాల్గొంటున్నాడని అంటున్నారు. సాధ్యమైనంత వరకూ ఈ ఏడాదిలోనే దీపావళి సందర్భంగా నవంబర్ 13న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడట క్రిష్. ఈ సినిమా ఆన్ లొకేషన్ లో పవన్ ఇటివలే ఎంటరయ్యాడని ఫిలింనగర్ సమాచారం. కానీ.. వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ వచ్చినట్టు ఈ పవన్27 కు బయటకు రావడం లేదు. ఈ సినిమా షూటింగ్ లో పవన్ ఈనెల 12 వరకూ పాల్గొంటాడని అంటున్నారు. తర్వాత షెడ్యూల్ జనసేన ఆవిర్భావ దినోత్సవం మార్చి 14 తర్వాత ఉంటుందని అంటున్నారు.

 

 

పవన్ ఇలా వరుసగా సినిమాలు చేయడం అభిమానులకు ఎక్కడలేని ఆనందాన్నిస్తోంది. మే నెల కోసం వెయిట్ చేస్తున్నామని అభిమానులు అంటుంటే.. నవంబర్ కూడా ఎప్పుడొస్తుందా అని కూడా ఆలోచిస్తున్నారు. ఏఎం రత్నం ఈ సినిమాను చాలా గ్రాండియర్ గా తెరకెక్కిస్తున్నాడట. చారిత్రాత్మక కధాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తే అభిమానులకు సంబరాలే.

మరింత సమాచారం తెలుసుకోండి: