అమెరికాకు చెందిన 'ఇన్ స్టైల్' అనే మేగజైన్ ఫోటో షూట్ లో ప్రియాంక చోప్రా జాకెట్ లేకుండా టాప్ లెస్‌గా చీరకట్టుతో చేసిన ఫోటో షూట్ పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రియాంక పై తీవ్ర విమర్శలు రావడమే కాకుండా 'భారతీయ సంస్కృతికి చిహ్నమైన చీరకట్టును అవహేళన చేస్తున్నావు' అంటూ కొందరు ఆమె పై దుమ్మెత్తి పోస్తున్న నేపధ్యం లో ఆమెకు సప్పోర్ట్ గా యాంకర్ రేష్మీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని సృష్టిస్తున్నాయి.

వాస్తవానికి ఇప్పటికే కొంతమంది ప్రియాంక ఫోటో షూట్లో వల్గారిటీ ఏమీ లేదని ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం ఏముందని కొందరు వాదిస్తుండగా మన కల్చర్ తప్పుదోవ పట్టిస్తున్నారంటూ మరికొందరు సాంప్రదాయ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రియాంక ఫోటో షూట్  మీడియాలో  జరుగుతున్న రాద్దాంతం పై ఓ ప్రముఖ మీడియా సంస్థ ఆసక్తికర కథనం వెలువరించింది. 

పురాతన భారతంలో రవికె(బ్లౌజ్) లేకుండానే చీర ధరించేవారు. తర్వాత క్రమక్రమంగా రవిక ధరించడం వాడుకలోకి వచ్చింది. ప్రియాంక చోప్రా ఫోటో షూట్ మీద అంతరాద్దాంతం చేయాల్సిన అవసరం ఏముంది? అంటూ ఆ మీడియా సంస్థ తన కథనంలో ప్రియాంకకు వత్తాసు తెలుపుతూ కామెంట్స్ చేసింది. ప్రియాంక చోప్రాకు సపోర్టుగా వచ్చిన ఈ కథనం యాంకర్ రష్మికి చాలా నచ్చింది. 

దీనితో తన అభిప్రాయాన్ని తన ట్విటర్ ద్వారా షేర్ చేస్తూ మహిళల వస్త్రధారణ పై ఎవరికీ ఎలాంటి కామెంట్స్ చేసే హక్కు లేదనీ రష్మీ కామెంట్స్ చేసింది. దీనితో ఆమె పై మాటల దాడి పెరిగి పోయింది. ‘జబర్దస్త్’  లాంటి కార్యక్రమానికి యాంకరింగ్ చేసే రష్మికి భారతీయ సంస్కృతి ఏమి తెలుస్తుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి మన దేశంలో మహిళలు ఎదుర్కుంటున్న ఎన్నో సమస్యలు ఉండగా వాటిని గురించి ఆలోచించలేని వ్యక్తులు ప్రియాంక ఫోటో షూట్ ను రష్మి కామెంట్స్ ను టార్గెట్ చేస్తూ ముఖ్యమైన సమస్యలను పట్టించుకోలేని మన సమాజంలోని వ్యక్తులు ఉయోగం లేని విషయాలపై దృష్టి పెడుతున్నారు అనిఅనుకోవాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: