ఆ మద్య మాలీవుడ్ బ్యూటీ భావనను ఆమె డ్రైవర్ లైంగిక వేదింపులకు గురి చేసిన సంఘట సంచలనం సృష్టించింది.  ఆ కేసులో ఓ నటుడు కూడా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.  భావన కు జరిగిన ఇబ్బందిపై అన్ని చిత్రపరిశ్రమలు తీవ్రంగా స్పందించాయి.  నేరస్తులకు శిక్ష పడేవరకు పోరాడాయి.  ఈ మద్య మీటూ, కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తున్న విషయం తెలిసిందే.  సాధారణ మహిళలకే కాదు సెలబ్రెటీలు కూడా ఈ మద్య లైంగిక వైధింపులకు గురి అవుతున్నారు. 

తాజాగా ప్రముఖ బెంగాల్ టీవీ సీరియల్ నటి స్వస్తికా దత్త పట్ల డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ డ్రైవర్ ని అరెస్ట్ చేశాడు.  వివారాల్లోకి వెళితే.. సీరియల్ షూటింగ్ కి వెళ్లడానికి బుధవారం నాడు ఉదయం స్వస్తికాదత్త ఉబెర్ లో క్యాబ్ బుక్ చేసుకుంది. కారులో ప్రయాణిస్తున్న ఆమెకు డ్రైవర్ పరిస్థితిపై అనుమానం కలిగింది..ఇంతలోనే ఆమె బుకింగ్ క్యాన్సిల్ చేసి ఆమెను బయటకు గుంజే ప్రయత్నం చేశాడు ఆ డ్రైవర్. దీంతో ఆమె ప్రతిఘటించింది.

వెంటనే డ్రైవర్ ఆమెని కారులోనే మరో ప్రదేశానికి తీసుకువెళ్లడానికి ప్రయత్నించాడు. తన స్నేహితులను ఫోన్ చేసి వాళ్లని కూడా రమ్మని చెప్పాడు. అంతే కాదు కారులోంచి బయటకు దూకి గట్టిగా కేకలు వేయడంతో డ్రైవర్ అక్కడ నుంచి పారిపోయాడు. ఇదంతా కేవలం అరగంట వ్యవధిలో జరిగిందని స్వస్తికా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కారు నెంబర్, డ్రైవర్ పేరుతో సహా వివరాలను షేర్ చేయడంతో వెంటనే పోలీసులు డ్రైవర్ ని అరెస్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: