Baadshah:తెలుగు ఫుల్ రివ్యూ || Tweet Review || English Full Review

జూనియర్ ఎన్టీఆర్ నటించిన కొత్త సినిమా ‘బాద్ షా’. ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శనను గురువారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ చిత్ర విశేషాలు మీ కోసం.
3:40pm:సినిమా ప్రారంభం శ్రీను వైట్ల శైలీలో సాగుతుంది. శ్రీనువైట్ల సినిమాలు అతని వాయిస్ ఓవర్ తో ప్రారంభం అవుతుంటాయి.
3:41pm:బాద్ షా సినిమా శ్రీను వైట్ల వాయిస్ ఓవర్ తో ప్రారంభం అయ్యింది. సీనియర్ ఎన్టీఆర్ గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ, ప్రిన్స్ మహేష్ కు ధన్యవాదాలు చెబుతున్నాడు.  
3:45pm: అసిస్ విద్యార్థి ‘క్రేజీ రాబర్ట్’గా నటిస్తున్నాడు. 
3:47pm: జూనియర్ ఎన్టీఆర్ సూపర్ హిట్ సినిమా ‘బృందావనం’ సినిమాను గుర్తుచేస్తూ అతని తండ్రిగా ముఖేష్ రుషి నటిస్తున్నాడు.
3:50pm: వెండితెర మీద జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్షమయ్యాడు. అతని ఎంట్రీ అద్భుతంగా ఉంది. ఫ్యాక్టరిలో ఫైట్ సీన్ జరుగుతుంది.
3:55pm: హీరోయిన్ కాజల్ పాత్ర ప్రవేశించింది. ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. పారిస్ అందాలు చక్కగా కనిపిస్తున్నాయి.
3:57pm: కాజల్ బాబాయ్ గా, చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తిగా తనికెళ్ల భరిణి నటిస్తున్నాడు.
4:02pm: సినిమాలో మొదటి పాట ప్రారంభం. ‘సైరో.. సైరో’ పాటలో జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులు అద్భుతంగా ఉన్నాయి. సంగీతం, కంపోజ్ చక్కగా కుదిరిన పాటలో జూనియర్ ఎన్టీఆర్ తన తడాఖా చూపిస్తున్నాడు.
4:07pm: సినిమాలో కామెడీ సీన్. శ్రీను వైట్ల స్టైల్ లో వెన్నెల కిషోర్ చేస్తున్న కామెడీ బాగుంది.
4:12pm: ప్రిన్స్ మహేష్ బాబు వాయిస్ ఓవర్. మాఫియా గురించి చెబుతున్నాడు. మహేష్ తన వాయిస్ తో సన్నివేశాలను ఆసక్తికరంగా మార్చివేశాడు.
4:18pm: ఎంఎస్ నారాయణ రంగ ప్రవేశం. శ్రీను వైట్ల సినిమాల్లోని కామెడీ కొంత మంది మీద రివేంజ్ తీసుకున్నట్లుగా ఉంటుంది. అదే తరహాలో ‘డైరెక్టర్ రివేంజ్ నాగేశ్వరరావు’గా ఎంఎస్ నారాయణ నటిస్తున్నాడు. ఈ దృశ్యాలు హాస్యంతో నిండిఉన్నాయి. శ్రీను వైట్ల మార్క్ చూపిస్తున్నాయి.
4:26pm: జూనియర్ ఎన్టీఆర్-కాజల్ మధ్య ప్రేమ సన్నివేశాలు. కాజల్ డైలాగులు బాగున్నాయి.
4:31pm: కాజల్ తో ఎన్టీఆర్ ‘డైమండ్ గర్ల్..’ సాంగ్. తమిళంలో ఐరెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న శింబు పాడిన పాట ఇది. శింబు ను డైమండ్ హ్యాండ్ గా మార్చే విధంగా ఎన్టీఆర్ డ్యాన్సులు ఉన్నాయి. కాజల్ అందాలు, పారిస్ అందాలు ఉన్నా ఎన్టీఆర్ నృత్యాలు కళ్ళు తిప్పుకొనివ్వడం లేదు. 
4:36pm: శ్రీను వైట్ల దూకుడు స్టైల్ లోనే బాద్ షా కూడా క్రైమ్, రొమాన్స్, కామెడీ జోనర్ లో సాగుతుంది.
4:37pm: పిల్లి కళ్ల బుల్లోడు నవదీప్ పోలీస్ పాత్రలో పరిచయం ఫర్వాలేదనిపిస్తుంది. నాగబాబు, షియాజీ షిండే మాత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో చాలా బాగున్నారు.
4:45pm: మరొక విలన్ ఎంట్రీ. ఈసారి ప్రదీప్ రావత్. బండ్ల గణేష్ సినిమా మీద పెట్టిన ఖర్చు స్క్రీన్ మీదకు బాగానే బదిలీ అయ్యింది.
4:52pm: గ్యాంగ్ స్టర్ బ్యాక్ గ్రౌండ్, స్టైలిష్ గెటప్స్, కాస్ట్ లీ సెట్టింగ్స్ తో టైటిల్ సాంగ్. కెమెరా మెన్ పనితనం బాగుంది.
5:00pm: పెద్ద సముద్రపు హార్బర్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ప్రదీప్ రావత్ కు మధ్య భారీ ఫైట్ సీన్. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయింది.
5:00pm: యాక్షన్ సీక్వెన్స్ ని డైరెక్టర్, స్టంట్ మాస్టర్  బాగా హాండిల్ చేశారు.
5:00pm: శ్రీను వైట్ల సినిమాలన్నింటి లోలాగానే, బాద్ షా లో కూడా స్క్రీన్ ప్లే  మీద మంచి పట్టు చూపిస్తున్నాడు.
5:00pm: సినిమా ప్రధమార్థం అంతా మోడరన్ గా, రొమాంటిక్ గా ఉంటూనే, క్రైమ్ ఎపిసోడ్ కు కావాల్సిన ఫ్లాట్ ఫాంని సిద్ధం చేశాడు. ఇప్పటి వరకూ సినిమా బావుంది. ద్వితీయార్థం కూడా బాగుంటే నందమూరి అభిమానులకు పండగే.
5:15pm: దలేర్ మోహందీ సూపర్ హిట్ ఫోక్ సాంగ్ ‘బంతిపూల జానకి..’ చూడ్డానికి బావుంది. జూనియర్ ఊషారైన స్టెప్పులు, మంచి కెమెరా పనితనం కలిసొచ్చాయి ఈ పాటకు.
5:20pm: పిల్లి పద్మనాభ సింహా... (హాహాహా..) శ్రీను వైట్ల సెంటిమెంట్ కామెడీ యాక్టర్ బ్రహ్మనందం పోలీస్ ఆఫీసర్ గా ఎంట్రీ ఇచ్చాడు.
5:23pm: దూకుడు కామెడీని మైమరిపించే కామెడీ సీన్స్... బుడ్డోడు (జూనియర్ ఎన్టీఆర్) బ్రహ్మానందం తాగుబోతు రమేష్ లాంటి సీజన్డ్ కమెడియన్స్ తో పోటీగా కామెడీ తెగ పండించేస్తున్నాడు.
5:26pm: సుహాసిని ఎన్టీఆర్ తల్లి పాత్రకు సరిగ్గా సరిపోయింది.
5:30pm: ట్విస్ట్. జూనియర్ ఫెర్ ఫ్మార్మెన్స్ చాలా బాగుంది.
5:40pm: నాది ఫైర్, నేనే ఫైర్... కామెడీ సీన్. బ్రహ్మనంద మామూలుగా నవ్వించడం లేదు.
5:50pm: యమదొంగ కంటే అల్టిమేట్ ఎపిసోడ్ : జస్టిస్ చౌదరిగా జూనియర్. పెద్దాయాన్ని గుర్తు తెచ్చేటట్లున్నాడు. స్క్రీన్ల్ మీదే చూడాల్సిన సీన్ ఇది.
6:00pm: ఈ టైమ్ లో ఫైట్ సీనే పానకంలో పుడకలాగా ఉంది.
6:10pm: వెల కమ్ టు మై పార్టీ .. కత్తి కనకం మాస్ సాంగ్ ఫుల్ ఫోలో ప్రజెంట్ చేశారు. అక్కడక్కడ కొంచెం ఓవర్ చేశారేమో అనిపించింది.
6:18pm: ఎన్టీఆర్ ఫ్రెండ్, సిద్ధార్థ్ ఎంట్రీ చిన్న క్యారెక్టరయినా ప్రాముఖ్యత ఉన్న పాత్ర సిద్ధార్థ్ కూడా పర్వాలేదనిపించాడు.
6:20pm: గబ్బర్ సింగ్ అంత్యాక్షరి ఎపిసోడ్ గుర్తుందా.. దానిని మించిన ఎంటర్టైనర్ సీక్వెన్స్ నడుస్తోంది.
6:20pm: పెద్దాయన సూపర్ హిట్ సాంగ్స్ కి బుడ్డోడి డ్యాన్స్ చూడముచ్చటగా ఉంది. ఇంకో రెండుసార్లు వేసినా చూడొచ్చు ఆ సీక్వెన్స్ ని బోర్ లేకుండా....
6:25pm: సినిమా దాదాపు అయిపోవచ్చింది. ప్రీ-క్లైమాక్స్ హేట్ బిల్డ్ అవుతుంది.
6:27pm: బ్రహ్మీ-ఎన్టీఆర్ కామెడీ ఎపిసోడ్ కి ముగింపు బాగానే ఉంది.
6:30pm: ఓకే సినిమా క్లైమాక్స్ ఫైట్ మొదలయ్యింది. డైరెక్టర్, స్టంట్ మాస్టర్, కెమెరామెన్లు పనితీరు బాగుంది. కొంచెం డ్రాగ్ అయినట్లనిపిస్తుంది.
6:35pm: ప్రతీ తెలుగు సినిమాలో లాగానే విలన్లను శిక్షించి, తనన వాళ్లందరినీ రక్షించడంతో సినిమా ముగిసింది.
6:35pm: ఈ ట్వీట్ రివ్యూ వ్రాయడానికి సహాకరించిన నందమూరి, ఏపి హెరాల్డ్ అభిమానులకు కృతజ్ఘతలు.
ఏపి హెరాల్డ్. కామ్ ట్వీట్ రివ్యూ రేపు (ఏప్రిల్ 5) ఉదయం 6:00am గం.లకు మొదలవుతుంది. వెనువెంటనే ఫుల్ రివ్యూ అందించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: