తెలుగు ప్రేక్షకులను శోక సంద్రంలో ముంచి ప్రముఖ నటులు, రాజకీయనాయకులు నందమూరి హరికృష్ణ ఈ రోజు రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన విషయం తెలిసిందే.  నందమూరి హరికృష్ణ హఠాన్మరణం చిత్ర సీమను విషాదంలో ముంచేసింది. ఈ విషయం తెలుసుకున్న నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కసారే షాక్ తిన్నారు..సినీ పరిశ్రమ మొత్తం స్తంభించిపోయింది. 
Image result for hari krishna death
ఈ నేపథ్యంలో సినీ, రాజకీయ, పారిశ్రామి వేత్తు సోషల్ మీడియ వేధికగా ఆయనకు సంతాపాన్ని తెలుపుతున్నారు. ఈ సందర్భంగా హరికృష్ణకు చెందిన ఓ అరుదైన ఫొటోను దర్శకుడు క్రిష్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.  చిన్న వయసులోనే ఆయన తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు.  ప్రతి విషయంలోనూ ఎంతో యాక్టివ్ గా ఉండే హరికృష్ణ బాలనటుడిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు.
Image result for director krish
చిన్న వయసులో తన తండ్రి ముందు నడుస్తున్న హరికృష్ణ ఈ ఫొటోలో ఉన్నారు. 'మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథ సారథి... చిన్ననాటే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం' అంటూ క్రిష్ ట్వీట్ చేశారు. 1962లో దేశ రక్షణ కోసం విరాళాలు సేకరిస్తున్న ఎన్టీఆర్ ముందు నడుస్తున్న హరికృష్ణ అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: