సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో అవకాసం చిక్కితే చాలు ఎవరు ఎవరి పై అయినా సెటైర్లు వేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ కామెంట్స్ ఒకొక్కసారి మరీ మితిమీరి కూడ కనిపిస్తున్నాయి. అయితే ఇలా తమను నెగిటివ్ కామెంట్స్ తో ట్రోల్ చేసిన వారి పై కొందరు సెలెబ్రెటీలు అసహనంతో కామెంట్స్ చేస్తే మరికొందరు తెలివిగా చురకలు అంటిస్తున్నారు.

ఇప్పుడు నమ్రతకు కూడ ఇలాంటి పరిస్థితి ఒక అభిమాని దగ్గర నుండి ఎదురైతే ఆమె తెలివిగా ఇచ్చిన సమాధానం మహేష్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఇక వివరాలలోకి వెళితే ‘మహర్షి’ సూపర్ సక్సస్ కావడంతో జోష్ లో ఉన్న నమ్రత ఒక ఫోటోను తన ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన అభిమానులకు షేర్ చేసింది. 

అయితే నమ్రత ఆ ఫోటోలో చాలా క్యాజువల్ లుక్ లో మేకప్ లేకుండా కనిపించడంతో ఒక నెటిజన్ "నమ్రత ఎందుకు నువ్వు మేకప్ వేసుకోవు నువ్వేమైనా డిప్రెషన్ తో బాధ పడుతున్నావా" అంటూ సెటైర్ వేసాడు. దీనికి ఘాటుగా స్పందించిన నమ్రత "మేకప్ తో ఉన్న మహిళలు నీకు నచ్చుతారేమో అందుకే నీ అభిరుచికి తగ్గట్టు ఎప్పుడూ మేకప్ వేసుకొనే వారిని ఫాలో అయితే బాగుంటుంది.  ఈ పేజ్ లో అలాంటివి ఉండవు.  అందుకే నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ఇది వదిలేస్తే మంచిది" అంటూ ఆ వ్యక్తికి రివర్స్ పంచ్ ఇచ్చింది నమ్రత.

1993 మిస్ ఇండియా అవార్డ్ ను గెలుచుకున్న నమ్రతకు తన మాట తీరుతో జడ్జీలను ఎలా మెప్పిమ్చాలో బాగా తెలుసు. అలాంటిది ఒక వ్యక్తి వ్యంగ్యంగా అడిగిన ప్రశ్నకు ఎలా సూటిగా సమాధానం ఇవ్వాలో నమ్రతకు బాగా తెలుసు అన్న విషయం ఈ సంఘటన మరొకసారి రుజువు చేసింది..   



మరింత సమాచారం తెలుసుకోండి: