ఇటీవల కాలంలో మహిళలపై అరాచకాలు విపరీతంగా పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.  ఉదయం పేపరు తీస్తే అవే వార్తలు.. టీవీ ఆన్ చేసే అవే న్యూస్.. మరొకటి కనిపించదు.  దేశంలో సమయాలు ఇంకేవి లేవా అంటే ఉంటాయి.. వాటిపై కంటే ఎక్కువమందికి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. 

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సోషల్ వెల్ఫేర్ కోసం ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  ఈ కార్యక్రమానికి బాలీవుడ్ కు చెందిన పలువురు సెలెబ్రటీలు హాజరవుతూ ఉంటారు.  ఈ కార్యక్రమానికి దీపికా, కంగనా, పరిణీతి చోప్రాలు హాజరయ్యారు.  


అమిర్ అడిగిన ఈవ్ టీజింగ్ ప్రశ్నకు కంగనా చెప్పిన సమాధానం అందరిని ఆశ్చర్యపరిచింది.  ఆలోచింపజేసింది.  మనసును కలిచివేసింది.  ఇంతకీ ఆమె చెప్పిన సమాధానం ఏంటి అనే డౌట్ వచ్చింది కదా. అక్కడికే వస్తున్నా.  కంగనా తన చిన్నతనంలో చండీగఢ్ లోని ఓ స్కూల్ లో చదువుకున్న రోజుల్లో ప్రతిరోజూ స్కూల్ కు చదువుకోవడానికి వెళ్తుండేది.  


అలా స్కూల్ కువెళ్తుండగా.. బైక్ మీద వస్తున్న ఓ వ్యక్తి ఎదురుగా వచ్చి కంగనా ఛాతీపై గట్టిగా కొట్టాడట.  దీంతో కంగనా ఐదు నిమిషాలపాటు షాక్ తిన్నది.  ఆ వెంటనే తేరుకొని, ఎవరైనా చూశారా అని అటుఇటు చూసిందట.  ఈ విషయం విన్న దీపికా, పరిణీతి చోప్రాలు షాక్ అయ్యారు.  


ఇలాంటి విషయాలు జరిగినపుడు మహిళలు ఏదో తప్పుచేశారని చుట్టూ ఉన్న వ్యక్తులు భావిస్తారని, ఇలాంటి సంఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయని, వాటిని అరికట్టాలని పరిణీతి చెప్పింది.  జనాలు సినిమా చూసే అన్నింటిని నేర్చుకుంటున్నారు.  అలాగే ఈవ్ టీజింగ్ చేయడం వలన కలిగే నష్టాలేంటి అనేదానిపై సినిమా తీస్తే అందరూ చూసి నేర్చుకుంటారు కదా.  


మరింత సమాచారం తెలుసుకోండి: