బాల‌న‌టిగా వెండితెరం గ్రేటం చేసి 11 ఏళ్ల‌కే పాండురంగ మ‌హ‌త్యంలో కృష్ణుడు పాత్ర‌లో న‌టించిన విజ‌య‌నిర్మ‌ల త‌న కెరీర్‌లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు. బాపు ద‌ర్శ‌కుడిగా మారిన సాక్షి సినిమాలో తొలిసారి క‌లిసి న‌టించిన ఈ జంట ప్రేమ‌లో ప‌డ‌డం... ఆ త‌ర్వాత రెండేళ్ల‌కే తిరుప‌తిలో పెళ్లి చేసుకోవ‌డం జ‌రిగాయి. ఇదిలా ఉంటే విజ‌య‌నిర్మ‌ల త‌న సినిమా కెరీర్‌లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు.


సూపర్ స్టార్ కృష్ణతోనే ఏకంగా 47 సినిమాల్లో నటించారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు ఎన్నో బ్లాక్‌బస్టర్‌గా నిలిచాయి. 1970-85 కాలంలో వీరి కాంబినేష‌న్లో సినిమాలు తీసేందుకు అగ్ర నిర్మాణ సంస్థ‌లు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు పోటీప‌డేవారు. ఈ కాంబినేష‌న్లో సినిమా అంటే ప్రేక్ష‌కుల్లో తిరుగులేని క్రేజ్ ఉండేది. 


కేవలం నటిగానే కాకుండా దర్శకత్వం, నిర్మాణ రంగాల్లోనూ విజయనిర్మల రాణించారు. 1971లో వ‌చ్చిన మీనా సినిమాతో తొలిసారి మెగాఫోన్ ప‌ట్టిన ఆమె ఆ త‌ర్వాత మొగుడు పెళ్లాల దొంగాట - మూడు పువ్వులు ఆరు కాయలు - హేమా హేమీలు - రామ్‌ రాబర్ట్‌ రహీం - సిరిమల్లె నవ్వింది - భోగి మంటలు - బెజవాడ బెబ్బులి - ముఖ్యమంత్రి - దేవదాసు - దేవుడే గెలిచాడు - రౌడీ రంగమ్మ - లంకె బిందెలు - కలెక్టర్‌ విజయ - ప్రజల మనిషి సినిమాల‌ను ఆమె డైరెక్ట్ చేశారు.


ఆమె కెరీర్‌లో మొత్తం 44 సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా2002లో గిన్నీస్‌ బుక్‌లో చోటు సంపాదించారు. ప్రపంచంలో ఏ మహిళా దర్శకురాలికి ఈ ఘనత దక్కకపోవడం తెలుగువారు గర్వించదగ్గ విషయం.  



మరింత సమాచారం తెలుసుకోండి: