మ‌న తెలుగు ప‌రిశ్ర‌మ‌లో భానుమ‌తిగారి త‌ర్వాత గ‌ర్వించ‌ద‌గిన బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి విజ‌య‌నిర్మ‌ల గారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా.. దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారు. అంత‌టి ప్రతిభావంతురాలిని మ‌నం ఇప్ప‌ట్లో ఇంకెవ‌రినీ చూడ‌లేం. కృష్ణ‌గారికి జీవిత భాగ‌స్వామినిగా ఎప్పుడూ ఆయ‌న ప‌క్క‌న నిల‌బ‌డి ఆయ‌న‌కు చేదోడు వాదోడుగా ఉంటూ త‌న ధ‌ర్మాన్ని నెర‌వేరుస్తూ వ‌చ్చారు. ఆమె లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావ‌త్ తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు. ఆమె మరణ అనంతరం పలువు సినీ ప్రముఖులు స్పందించారు..

 

చిరంజీవి: విజయనిర్మలలాంటి ప్రతిభావంతురాలిని ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేము. విజయ నిర్మల హఠాన్మరణం తనని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు.

 

బాలకృష్ణ: ద‌ర్శ‌కురాలిగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి ఎంతో మంది మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. ఆమె మృతి చిత్ర‌సీమ‌కు తీర‌నిలోటు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆ భ‌గ‌వంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

 

సుధీర్‌బాబు: మా కుటుంబానికి బాధాకరమైన రోజు. ఓ లెజెండ్‌, అంతకుమించి నా తల్లిలాంటి వ్యక్తిని కోల్పోయాం. ఆమె దేవుడి సన్నిధికి చేరిపోయారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలి. పురుషాధిక్యం ఉన్న ఈ చిత్ర పరిశ్రమలో ఆమె మహిళలకు ఒక దారి చూపించారు. మహిళా సాధికారతకు ఆమెకు చిహ్నంలా మిగిలిపోతారు.

 

జూ.ఎన్టీఆర్‌: విజయ నిర్మల జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె ఇక లేరన్న వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యా.

 

రాశీ ఖన్నా: విజయ నిర్మల హఠాన్మరణం షాక్‌కు గురిచేసింది. చిత్ర పరిశ్రమలో స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ఎంచుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

 

అల్లరి నరేశ్: చిత్ర పరిశ్రమకు విజయ నిర్మల మూలస్తంభం లాంటివారు. నటిగా, దర్శకురాలిగా ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆమె మరణం తీరని లోటు. కృష్ణ, నరేశ్‌ కుటుంబీకులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.

 

నితిన్‌: విజయ నిర్మల అప్పుడే వెళ్లిపోవడం బాధాకరం. తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు.

 

ఈషా రెబ్బా: తెలుగు చిత్ర పరిశ్రమకు ఐరన్‌ లేడీ లాంటివారైన విజయనిర్మల ఇక లేరని తెలిసి షాకయ్యాను. గొప్ప నటి, దర్శకురాలు, గిన్నీస్‌ బుక్‌ రికార్డు సాధించిన మహిళ. తెలుగు చిత్ర పరిశ్రమకు మీరు అందించిన సేవలు మరువలేనివి.

 

మంచు మనోజ్‌: మీరు ఇండస్ట్రీకి వచ్చి చరిత్ర సృష్టించారు. మీరు సాధించినంతగా మున్ముందు తరాల వారూ సాధించలేరేమో. ఇప్పుడు మీరు వెళ్లిపోయారు. మిమ్మల్ని మిస్సవుతాం నానీ (అమ్మమ్మ). మీ సినిమాలు మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.

 

శ్రీను వైట్ల: ఎంతటి బాధాకరమైన విషయం. విజయ నిర్మల ఇక లేరు. మిమ్మల్ని చాలా మిస్సవుతాం మేడమ్‌. మా పట్ల మీరు చూపించిన ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేం.


మరింత సమాచారం తెలుసుకోండి: