తాజాగా అమెరికాలో తెలుగు వాళ్ళందరూ కలిసి ఓ సమావేశం పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రతి ఏటా జరిగే ఈ సమావేశాలకు ఇక్కడి నుంచి తెలుగు వాళ్ళలో రాజకీయ, సినిమా రంగానికి చెందిన వాళ్లతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు భారీగా తరలి వెళుతుంటారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఆ సమావేశాలకు టాలీవుడ్లో ఓ సీనియర్ మోస్ట్ కమెడియన్ కూడా వెళ్లారు. ఈ సమావేశంలో పాల్గొన్న తర్వాత ఆ సంఘం వాళ్ళు ఆ కమెడియన్ కు ప్రత్యేకంగా సన్మానం ఏర్పాటు చేశారు.
ఈ సన్మాన కార్యక్రమం ముగిశాక వాళ్లు భారీగా పార్టీ ఇచ్చారట. ఈ పార్టీలో ఆ సంఘానికి చెందిన కొన్ని కుటుంబాలు తమ కుటుంబ సభ్యులతో సహా పాల్గొన్నాయి. ఈ క్రమంలోనే ఆ సీనియర్ మోస్ట్ టాప్ కమెడియన్ అక్కడకు వచ్చిన ఓ ఫ్యామిలీకి చెందిన మహిళతో తీవ్ర అసభ్యంగా ప్రవర్తించాడు అట. ఆ కాస్త మోడ్రన్ డ్రెస్సుతో కమెడియన్ దగ్గరకు వచ్చే సరికి తాగిన మైకంలో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడట.
చివరకు ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రెడీ అవ్వడంతో... నిర్వాహకులు ఆ మహిళా కుటుంబ సభ్యులను బ్రతిమాలి.. కేసు పెడితే లేనిపోని హంగామా అవుతుందని.. ఈ సారికి క్షమించి వదిలేయమని నచ్చ చెప్పారట. దీంతో ఆ టాప్ కమెడియన్ బతుకు జీవుడా ? అనుకుని బయట పడ్డాడట. ఇంతకు ఎప్పటి నుంచో సీనియర్ కమెడియన్గా ఉన్న ఆయన కామెడీ ఇటీవల పండట్లేదు. జనాలకు కూడా విసుగు వచ్చేసింది. ఇక ఇంతకు ముందే సదరు సీనియర్ కమెడియన్ ఇలాంటి పిచ్చి పనులతో పరువు పోగొట్టుకున్నాడు.